June 23, 2022
లవ్‌స్టోరి, బంగార్రాజు వంటి హిట్ చిత్రాల తర్వాత నాగ చైతన్య నటించిన థ్యాంక్యూ విడుదలకి సిద్దంగా ఉంది.
ఆ సినిమా తర్వాత తన 22వ సినిమా కోసం ఏస్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేతులు కలిపారు నాగ చైతన్య. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ లో చై సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంయుక్తంగా సంగీతం అందించనుండడం మరో విశేషం.
ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
లీడ్ పెయిర్‌పై చిత్రీకరించిన ముహూర్తానికి బోయపాటి శ్రీను క్లాప్ ఇవ్వగా, రానా దగ్గుబాటి కెమెరా స్విచాన్ చేసారు.
ప్రముఖ నటుడు, దర్శకుడు భారతి రాజా గారు, “ది వారియర్” దర్శకుడు ఎన్ లింగుసామి, బూరుగుపల్లి శివరామ కృష్ణ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు.
జులై నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర వివరాలు త్వరలో చిత్ర యూనిట్ వెల్లడించనుంది.
NagaChaitanya-KrithiShetty-VenkatPrabhu Film Launched: NagaChaitanya-KrithiShetty-VenkatPrabhu Film Launched:ReadMore: పవన్ సాయిధరమ్‌తేజ్ కాంబినేషన్ సెట్..డైరెక్టర్ ఎవరో తెలుసా?