నాగార్జున ‘ది ఘోస్ట్’ థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేసిన మహేష్ బాబు

August 25, 2022

నాగార్జున ‘ది ఘోస్ట్’ థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేసిన మహేష్ బాబు

అక్కినేని నాగార్జున హీరోగా న‌టిస్తోన్న ది ఘోస్ట్ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను మ‌హేశ్‌బాబు రిలీజ్ చేశారు. ఏజెంట్ విక్రమ్‌గా పవర్-ప్యాక్డ్ ఫెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు నాగార్జున . ఆయ‌న సబార్డినేట్‌గా సోనాల్ చౌహాన్ గ్లామర్ విందు పంచింది. నాగార్జున సోదరిగా గుల్ పనాగ్ నటిస్తుండగా, మేనకోడలుగా అనిఖా సురేంద్రన్ కనిపించింది. ట్రైలర్‌లో ది ఘోస్ట్ తన ప్రధాన ఆయుధం తమహగనే వాడినట్లు చూపించారు. ఇక క‌థ విషయానికి వస్తే ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్ (నాగార్జున) గ్యాంగ్‌స్టర్ల నుండి ముప్పు ఉన్న తన చెల్లెలు మేనకోడలిని సంరక్షిస్తానని తండ్రికి మాట ఇస్తాడు. అయితే వారికి హాని చేసే ఆ గ్యాంగ్ ఎవ‌రు? వారిని ఓడించి ఎలా రక్షించాడు అనేది మూల‌క‌థ అని తెలుస్తోంది. అయితే అక్క‌డ‌క్క‌డ వైల్ట్‌డాగ్ ఛాయ‌లు క‌నిపించాయి. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

ట్రెండింగ్ వార్తలు