నాని దసరా బ‌డ్జెట్‌ సమస్య తీరినట్లేనా!

July 2, 2022

నాని దసరా బ‌డ్జెట్‌ సమస్య తీరినట్లేనా!

Nani Dasara Movie Shooting Resumes in Hyderabad: శ్యామ్‌ సింగరాయ్‌ వంటి డీసెంట్‌ ఫిల్మ్‌ తర్వాత నాని తీసిన ‘అంటే..సుందరానికీ..’ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో నెక్ట్స్‌ చిత్రంపై నాని ఫోకస్‌ పెట్టారు. అదే నానీస్‌ ‘దసరా’ చిత్రం. ‘నేను లోకల్‌’ తర్వాత నాని, కీర్తీ సురేశ్ కాంబొలో వ‌స్తోన్న చిత్ర‌మిది. శ్రీకాంత్‌ ఒదేల ఈ సినిమాతో దర్శకుడిగా ప‌రిచయ‌మ‌వుతున్నాడు.‘దసరా’ టైటిల్ కు త‌గ్గ‌ట్టే సినిమాను దసరా సమయంలోనే రిలీజ్‌ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్‌ చేసింది. అయితే బడ్జెట్‌ విషయంలో ఈ చిత్రం నిర్మాత సుధాకర్‌ చెరుకూరి, దర్శకుడు శ్రీకాంత్, హీరో నానిల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ‘దసరా’ సినిమాకు బ్రేక్‌ పడింది.

నిజానికి వి, ట‌క్ జ‌గ‌దీష్ సినిమాలు డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ ఓటీటీ రిలీజ్ వల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోలేదు. ఇక థియేట‌ర్స్‌లో విడుద‌లైన శ్యాంగ్ సింగ‌రాయ్ సినిమా కూడా యావ‌రేజ్ టాక్‌తో నానికి కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించేలా చేసింది. మ‌ళ్లీ అంటే సుంద‌రానికితో ఫ్లాఫుల బాట ప‌ట్టారు నాని. ఆ సినిమా మొత్తం క‌లెక్ష‌న్లు నాని రెమ్యున‌రేష‌న్ కంటే త‌క్కువ‌గానే వ‌చ్చాయి. దాంతో నాని కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ద‌స‌రా యూనిట్ డైల‌మాలో ప‌డింది.

నాని మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని రెమ్యున‌రేష‌న్, బ‌డ్జెట్ విష‌యంలో అంత ఖ‌ర్చుచేయ‌లేమ‌ని తెగేసి చెప్పేసింది. దీంతో చేసేందేం లేక నాని త‌న రెమ్యున‌రేష‌న్ మ‌రియు 60 కోట్ల‌తో తెర‌కెక్కాల్సిన చిత్రానికి 40 కోట్ల‌తో పూర్తిచేయ‌డానికి ఒప్పుకున్నారు. దాంతో కొంత విరామం తర్వాత దసరా సినిమా షూటింగ్‌ మళ్లీ షురూ అయ్యింది(Nani Dasara Movie Shooting Resumes). హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. సో…నిర్మాత‌ల‌కి నాని దసరా బడ్జెట్‌ సమస్య తీరినట్లేనని అనుకోవచ్చు.

ఇంకా చ‌ద‌వండి: రామ్‌ ఆపరేషన్‌ స్టార్ట్‌…ఆస‌క్తిక‌రంగా వారియ‌ర్ ట్రైల‌ర్‌

ట్రెండింగ్ వార్తలు