రికార్డు ధ‌ర‌కు అమ్ముడైన నాని శ్యామ్ సింగ‌రాయ్ హిందీ రైట్స్‌…

November 22, 2021

రికార్డు ధ‌ర‌కు అమ్ముడైన నాని శ్యామ్ సింగ‌రాయ్ హిందీ రైట్స్‌…
నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం శ్యామ్ సింగ‌రాయ్‌. సాయి ప‌ల్ల‌వి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్‌ హీరోయిన్స్‌గా న‌టించారు. రాహుల్‌ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్‌ గోమఠం వంటి వారు కీలక పాత్రలు పోషించారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్, భారీ వర్షాలు, ఈదురు గాలులు ఇలా అన్ని అడ్డంకుల‌ను అధిగ‌మించి ఇటీవ‌ల షూటింగ్ పూర్తి చేసింది చిత్ర యూనిట్‌. న‌వంబ‌ర్ 18న విడుద‌లైన టీజ‌ర్ ఆసక్తిక‌రంగా ఉండ‌డంతో సినిమాపై అంఛ‌నాలు భారీగా పెరిగాయి. క్రిస్ట‌మ‌స్ కానుక‌గా డిసెంబ‌రు 24న ఈ సినిమా విడుద‌ల‌కాబోతుంది. నాని గ‌త రెండు చిత్రాలు వి, ట‌క్ జ‌గ‌దీష్ డైరెక్ట్ ఓటీటీలో విడుద‌ల చేయ‌డంతో నాని సినిమాల‌పై డిస్ట్రిబ్యూట‌ర్లు కొంత కోపంగా ఉన్నారు. నిర్మాత‌లు చెప్పిన రేట్లకు తెలుగు డిస్ట్రిబ్యూట‌ర్లు అంత ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని తెలుస్తోంది. తెలుగులో చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నా శ్యామ్ సింగ‌రాయ్ హిందీ రైట్స్ మాత్రం భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయాయి. నాని కెరీర్‌లోనే హైయెస్ట్‌గా 10కోట్ల‌కు పైగా ధ‌ర‌కు హిందీ రైట్స్ అమ్ముడ‌య్యాయిని తెలుస్తోంది. బీఫ‌ర్‌యూ ఛానెల్ ఈ రైట్స్‌ను ద‌క్కించుకుంది. తెలుగులో ఈ సినిమా ఎంత వ‌ర‌కు బిజినెస్ చేస్తోందో చూడాలి మ‌రి

ట్రెండింగ్ వార్తలు