సాయి పల్లవి అందం కోసం వాటికి సర్జరీ చేయించుకుందాం.. నటి రియాక్షన్ ఇదే!

May 2, 2024

సాయి పల్లవి అందం కోసం వాటికి సర్జరీ చేయించుకుందాం.. నటి రియాక్షన్ ఇదే!

సినీనటి సాయి పల్లవి ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగే హీరోయిన్లకు కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పాలి ఈమె అవకాశం వచ్చిన ప్రతి సినిమాని కూడా సద్వినియోగం చేసుకోదు ఏ సినిమాలు అయితే కథ ప్రాధాన్యత ఉంటుందో అలాంటి సినిమాలకు మాత్రమే కమిట్ అవుతూ సినిమాలలో నటిస్తూ ఉంటారు. ఈ విధంగా వరుస సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నటువంటి సాయి పల్లవి సినిమాలలో గ్లామర్ పాత్రలకు అలాగే లిప్ కిస్ సన్నివేశాలకు కూడా దూరంగా ఉంటారు.

ఇలా సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేసే సాయి పల్లవి ప్రస్తుతం తెలుగు తమిళ హిందీ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు. ఇక ఈమె ఇండస్ట్రీకి ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి మొహం పై పెద్ద ఎత్తున మొటిమలు ఉండడం మనం చూసాము.

ఇక ప్రస్తుతం సాయి పల్లవి మొహంపై పింపుల్స్ ఎక్కడ కనిపించకపోవడంతో ఈమె వీటి కోసం కూడా సర్జరీ చేయించుకున్నారా అన్న సందేహాలు చాలామందికి కలిగాయి. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి పల్లవికి ఇదే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తాను పింపుల్స్ పోవడం కోసం ఏ విధమైనటువంటి సర్జరీలు చేయించుకోలేదని క్లారిటీ ఇచ్చారు.

సాధారణంగా టీనేజ్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి పింపుల్స్ రావడం సర్వసాధారణం అయితే వయసు పెరిగే కొద్ది అవి కూడా వెళ్లిపోతాయని తనకి కూడా అలాగే వచ్చి వెళ్లిపోయాయని ఈమె తెలిపారు. ఇకపోతే తాను తన జుట్టు కోసం మాత్రం అలోవెరా జెల్ ఉపయోగిస్తానని అందుకే తన జుట్టు ఇలా ఒత్తుగా ఉంటుంది అంటూ సాయి పల్లవి వెల్లడించారు.

ఇక తాను చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఎలాంటి ప్రొడక్ట్స్ ఉపయోగించనని తెలిపారు. కానీ తాను తీసుకునే ఆహార పదార్థాలన్నీ కూడా చాలా ఆర్గానిక్ గా పండిన వాటిని తింటానని ఈ సందర్భంగా సాయి పల్లవి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈమె తెలుగులో నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read More: దేవర, మహేష్ సినిమాలపై అప్డేట్స్ ఇచ్చిన డైరెక్టర్స్.. ఏమన్నారంటే?

ట్రెండింగ్ వార్తలు