August 23, 2022
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్‌ఫాదర్. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార , సత్య దేవ్‌తో సహా ఇతర ప్రముఖ పాత్రలను పరిచయం చేశారు. అయితే ఇప్పటిదాకా ఈ సినిమా వీఎఫ్ఎక్స్ షాట్స్ విషయంలో ట్రోల్ చేసిన నెటిజన్లు ఇప్పుడు తమన్ బీజీఎమ్ కూడా కాపీ అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా ఈ టీజర్ కి తమన్ ఇచ్చిన మ్యూజిక్‌పై ట్రోలింగ్ నడుస్తుంది.
తమన్ బీజీఎమ్ అచ్చం వరుణ్ తేజ్ గని టైటిల్ సాంగ్‌లా ఉందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తమన్‌పై ఇలాంటి ట్రోలింగ్ రావడం ఇదేం మొదటిసారి కాదు..గతంలో కూడా కాపీ ట్యూన్లు అని ఫ్యాన్స్ గట్టిగానే ట్రోల్ చేశారు. దాంతో కొంత టైమ్ తీసుకుని తమన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. అయితే మళ్లీ తీరు మార్చుకోకుండా మక్కీకి మక్కీ దించేశాడంటూ తమన్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. మెగాస్టార్ సినిమాకు కూడా ఇలా కాపీ కొడతావా అంటూ నెటిజన్లు తమన్‌పై మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. అయితే గని సినిమాకు కూడా తమనే మ్యూజిక్ ఇవ్వడం కొస మెరుపు.
Super @MusicThaman 👏 pic.twitter.com/AJeoHAyGDl
— ʌınɐʎ (@CoolestVinaay) August 21, 2022
#GodFatherTeaser lone dorikipoyav ga ra #Thaman 🙄 pic.twitter.com/ND61touLV5
— .S. (@Syamsvs) August 21, 2022