ఎప్పుడొచ్చిన మా స్థాయి మారదు

January 9, 2022

ఎప్పుడొచ్చిన మా స్థాయి మారదు
సంక్రాంతి సందర్భంగా ఈ నెల 07న విడుదల కావాల్సిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వాయిదా పడింది. దీంతో సినీ లవర్స్‌ అందరు నిరాశ చెందారు. కొందరు నెటిజన్లు ఆర్‌ఆర్‌ఆర్‌పై సెటర్లు వేయగా, మరికొందరు ఆర్‌ఆర్‌ఆర్‌ పట్ల పాజిటివ్‌గా మాట్లాడారు. ఇంకొందరు ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల మరింత ఆలస్యమైతే ప్రమాదెమో అన్నట్లుగా పరోక్షంగా మాట్లాడుతున్నారు. ఈ నెటిజన్లుకు ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ బదులు చెప్పింది..‘మేం ఎప్పుడొచ్చిన మా స్థానం, స్థాయి మారదు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు బాగోలేవు. ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల విషయంలో మేం సరైన నిర్ణయమే తీసుకున్నాం’’అని ఆర్‌ఆర్‌ఆర్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు కీరవాణి సంగీతం అందించగా, ఆలియాభట్, ఒలివియా మోరిస్‌ హీరోయిన్స్‌గా నటించారు.Readmore ఆర్ ఆర్ ఆర్ ర‌న్ టైం ఎంతో తెలుసా..?

ట్రెండింగ్ వార్తలు