April 8, 2024
అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇలా ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి అనంతరం తెలుగులో కూడా అవకాశాలను అందుకున్నటువంటి అనుపమ ఎక్కడ కూడా తన సరిహద్దులను దాటి సినిమాలలో నటించిన దాఖలాలు లేవు ఇలా పక్కింటి అమ్మాయి అనే భావన ఈమెను చూస్తే కలుగుతుంది.
ఇలా కెరియర్ పరంగా లిమిట్స్ పెట్టుకొని మరి సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె ఇటీవల టిల్లు స్క్వేర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ సినిమాలో పెద్ద ఎత్తున రొమాంటిక్ సన్నివేశాలలో సన్నివేశాలలో నటించడమే కారణమని చెప్పాలి.
అయితే తాను చేస్తున్నటువంటి ఈ బోల్డ్ సన్నివేశాల గురించి ఇదివరకే ఈమె స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి ఈమె స్పందించారు. నేను గ్లామరస్ పాత్రలలో నటించనని అలాగే లిప్ కిస్ సన్నివేశాలలో నటించినని 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చెప్పాను కానీ ఇప్పుడు నేను కూడా నటిగా కాస్త పరిణితి చెందాను.
నటన పరంగా కథ డిమాండ్ చేస్తే తప్పనిసరిగా నటించాల్సి ఉంటుంది అందుకే నేను ఇలాంటి సన్నివేశాలలో నటించానని అయినా లిప్ కిస్ సన్నివేశాలలో నటిస్తే తప్పేంటని ఈమె ప్రశ్నించారు. ఎప్పుడూ నేను మూస దోరనిలో ఉండే సినిమాలలో నటించాలని కోరుకోలేదని కథ డిమాండ్ చేస్తే తప్పకుండా ఇలాంటి సన్నివేశాలలో నటిస్తాను అంటూ ఈమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇక చాలామంది ఈ సినిమా చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు విమర్శలు చేస్తున్నారు అయితే విమర్శలు చేసేవారు సినిమా చూసి విమర్శలు చేస్తే బాగుంటుందని కూడా అనుపమ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read More: రహస్యంగా నిశ్చితార్థం.. వారికి మాత్రమే రహస్యం అంటున్న సిద్ధార్థ్!