యుఎస్ లో టిల్లు స్క్వేర్ రికార్డ్స్.. రిలీజ్ కి ముందే భారీ బిజినెస్!

March 28, 2024

యుఎస్ లో టిల్లు స్క్వేర్ రికార్డ్స్.. రిలీజ్ కి ముందే భారీ బిజినెస్!

డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ టిల్లు స్క్వేర్. ఈ సినిమా మార్చ్ 29, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్ తో పాటు పాటలను, ట్రైలర్ ను, రిలీజ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసింది. ఇక ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించడంతో మూవీ హడావుడి ఓ రేంజ్ లో కనిపిస్తుంది.

డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ధియేట్రికల్ బిజినెస్ గట్టిగానే జరిగినట్లు సమాచారం. బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినీమాస్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. అయితే ఈ సినిమా ఇండియాలోనే కాకుండా యూఎస్ లో కూడా సాలిడ్ బుకింగ్స్ రిజిస్టర్ చేస్తుంది. జస్ట్ ప్రీ సేల్స్ లోనే రెండు లక్షల డాలర్స్ కి పైగా రాబట్టటం విశేషం.

అక్కడ మార్చి 28వ తేదీన 150 కి పైగా లొకేషన్లో 500 కు పైగా ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు.అంటే ఈ సినిమా పట్ల యూఎస్ ఆడియన్స్ ఎంత క్రేజ్ కనబరుస్తున్నారో అర్థం అవుతుంది. టోటల్ గా ప్రీమియర్ నెంబర్స్ ఎంతవరకు వెళ్తాయో వేచి చూడాలి. నార్త్ అమెరికాలో 200 కే డాలర్ల మార్కుని టిల్లు స్క్వేర్ మూవీ క్రాస్ చేయటంతో ఈ ఫీట్స్ సాధించిన యంగ్ హీరోగా సిద్దు రికార్డ్ క్రియేట్ చేశాడు.

నార్మల్ గా అయితే సిద్దు జొన్నలగడ్డ కి అంత మార్కెట్ లేదు కానీ టిల్లు బ్రాండ్ కి ఉన్న ఫేమ్ వలన ఇంత కలెక్షన్ జరుగుతుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల, రాజమణి సంగీతం అందించారు. గతంలో డీజె టిల్లు కి కూడా యూఎస్ లో భారీ వసూళ్లు నమోదయ్యాయి.

Read More: జాతి రత్నాలు హీరోకి యుఎస్ లో బైక్ యాక్సిడెంట్.. డాక్టర్లు ఏమన్నారంటే!

ట్రెండింగ్ వార్తలు