కొత్త ప్రాజెక్టులతో టాలీవుడ్ హీరోలు.. కళకళలాడుతున్న తెలుగు చిత్ర సీమ!

April 6, 2024

కొత్త ప్రాజెక్టులతో టాలీవుడ్ హీరోలు.. కళకళలాడుతున్న తెలుగు చిత్ర సీమ!

ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్ట్లను కంప్లీట్ చేసుకుని కొత్త ప్రాజెక్టుల వైపు అడుగులు వేస్తున్నారు మన టాలీవుడ్ హీరోలు. ఇంతకుముందు సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు చేసే మన హీరోలు పాన్ ఇండియా పుణ్యమా అని రెండు మూడు ఏళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. దాదాపు అగ్ర హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేయటం, ఇంచుమించు అవన్నీ ఒక్కసారే చివరి దశకు రావడంతో అందరూ నెక్స్ట్ ప్రాజెక్ట్ ల వైపు అడుగులు వేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉన్నప్పటికీ ఓజీ ప్రాజెక్టు ఒక కొలిక్కి వచ్చేసినట్లే ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 27వ తేదీన ఆ సినిమా విడుదల ఖాయమని ఇటీవలే నిర్మాత ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే తర్వాత అతని చేతిలో ఉస్థాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ ఉంది. ఇక చాలా రోజుల నుంచి గేమ్ చేంజర్ సినిమాతో ట్రావెల్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఆ సినిమా కూడా ఇప్పుడు ముగింపు దశకు వచ్చేయడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేయబోతున్నాడు.

వచ్చేనెల నుంచే ఆ సినిమా పట్టాలెక్కుతుంది. ఇక ప్రభాస్ కల్కి సినిమా కూడా త్వరలోనే పూర్తి కాబోతున్న తరుణంలో ది రాజా సాబ్, సాలార్ 2 సినిమాలపై దృష్టి పెడుతున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే చాలా రోజుల నుంచి దేవర సినిమాతో ట్రావెల్ చేస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణ చివరి దశకి చేరుకుంది ఈ ప్రాజెక్టు తరువాత బాలీవుడ్ సినిమా వార్ 2 ప్రాజెక్టులో జాయిన్ అవుతాడు. ఇక పాన్ ఇండియా మూవీ పుష్ప టు సినిమా చిత్రీకరణ కూడా ముగింపు దశకు చేరుకోవటంతో అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని అట్లీ డైరెక్షన్లో చేయబోతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఆ ప్రాజెక్టు గురించిన చర్చలు జరుగుతున్నాయి. మహేష్ బాబు ఆల్రెడీ రాజమౌళి సినిమాతో ప్రయాణం మొదలు పెట్టేసాడు. ఇక నాగచైతన్య తండెల్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవటంతో నెక్స్ట్ ప్రాజెక్టు డైరెక్టర్ కార్తీక్ దండు మూవీ చేయబోతున్నాడు. హీరో నాని సరిపోదా శనివారం సినిమా తర్వాత దసరా కాంబినేషన్ మూవీలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇలా హీరోల కొత్త ప్రాజెక్టులతో టాలీవుడ్ కళకళలాడిపోతుంది.

Read More: Manjummel Boys Movie Telugu Review: మంజుమ్మల్ బాయ్స్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్.. ఆకట్టుకునే ఎమోషనల్ థ్రిల్లర్!

ట్రెండింగ్ వార్తలు