March 30, 2024
అందరూ ఊహించినట్లుగానే సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాకి వేరే సినిమాలు ఏవి పోటీ లేకపోవడం, సినిమా గురించి ఉదయం నుంచి మంచి పాజిటివ్ టాక్ వస్తూ ఉండటంతో మొదటి రోజు కలెక్షన్లు భారీగా వస్తాయని అనుకుంటున్నారు. అది కాకుండా డీజే టిల్లు సినిమాకి మంచి క్రేజ్ రావటంతో ఆ ప్రభావం కూడా టిల్లు స్క్వేర్ మీద పడటం సినిమాకి ప్లస్ అయింది.
సాంకేతికంగా రామ్ మిర్యాల, అచ్చు రాజమణి అందించిన పాటలు సినిమా ఫ్లోలో పర్ఫెక్ట్గా మెర్జ్ అయ్యాయి. బీమ్స్ నేపథ్య సంగీతం కథనానికి కరెక్ట్ గా అమరింది.శుక్రవారం ఈ సినిమా విడుదలైన సందర్భంగా చిత్ర బృందం విలేకరులతో ముచ్చటించింది. సినిమా హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ నన్ను నమ్మి అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమాని తీశారు నిర్మాతలు. ఇలాంటి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకి కృతజ్ఞతలు.
నటుడి కంటే ముందు ఈ సినిమాకి రచయితని అందుకే రాసేటప్పుడు చాలా నిజాయితీగా రాశాను. థియేటర్లలో ప్రేక్షకులు కథ గురించి కాకుండా వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా హిట్ అవుతుందని తెలుసు కానీ ప్రేక్షకుల నుంచి ఆ మాట వినటం మరింత ఆనందంగా ఉంది అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు సిద్దు జొన్నలగడ్డ. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ మొదటి రోజే మంచి టాక్ వచ్చింది.
రాబోయే సెలవులు కూడా కలిసి వస్తాయి తప్పకుండా ఈ చిత్రం 100 కోట్లు సాధిస్తుందని నమ్మకం ఉంది. మూడో భాగాన్ని కూడా త్వరలోనే ప్రకటిస్తాం అని చెప్పుకొచ్చారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ఇలాంటి పాత్రను పోషించటం ఇదే మొదటిసారి కావటంతో చాలా సందేహాలు ఉండేవి కానీ సినిమాకి వస్తున్న స్పందన చూసి చాలా తృప్తిగా అనిపించింది. ఈ సినిమా ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోను అన్నారు.
Read More: క్రేజీ డైరెక్టర్ కాంబినేషన్లో సూర్య 44వ సినిమా.. అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్!