ఇకపై ఇలాంటి కథలతోనే వస్తాను.. సలార్ 2 అప్డేట్ ఇచ్చిన ప్రభాస్!

January 4, 2024

ఇకపై ఇలాంటి కథలతోనే వస్తాను.. సలార్ 2 అప్డేట్ ఇచ్చిన ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల కాలంలో వరుస ప్లాప్ సినిమాలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన పాన్ ఇండియా స్టార్ హీరో కాకముందు ప్రతి ఒక్క జానర్ సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్ సినిమాలతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రేమ కథ సినిమాల ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుస సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే ఈయన ఇటీవల డివోషనల్ ప్రిడిక్షన్ సినిమాలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. భారీ బడ్జెట్ సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో పూర్తిస్థాయిలో ప్రేక్షకులను నిరాశపరిచాయి.

ఇక ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రభాస్ ఈ సినిమా యాక్షన్ డ్రామా సీక్వెన్స్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంది ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ తన సినిమాల గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు అంతేకాకుండా సలార్ సీక్వెల్ గురించి అప్డేట్ కూడా ఇచ్చారు.

నాకు విభిన్న నేపథ్య కథల్లో నటించాలని ఉంది. ప్రేక్షకుల నుంచి సలార్‌కు వచ్చిన స్పందనే నా తర్వాతి సినిమాలకు కూడా వస్తుందని ఈయన వెల్లడించారు ఇకపై ఇలాంటి సినిమా కథలతోనే మీ ముందుకు వస్తానని ప్రభాస్ వెల్లడించారు. ఇక ప్రస్తుతం తాను సైన్స్ ఫిక్షన్ అలాగే హర్రర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని వెల్లడించారు. ఇక సలార్ 2 గురించి మాట్లాడుతూ ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తయిందని వెల్లడించారు. ఈ సినిమా కోసం మీరు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారనే విషయం నాకు తెలుసు అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ కూడా విడుదల చేస్తామని ప్రభాస్ ఈ సందర్భంగా వెల్లడించారు.

Read More: ఓటీటీలోకి వచ్చేసిన హాయ్ నాన్న… ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

ట్రెండింగ్ వార్తలు