December 7, 2021
ఇటీవల వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలకు తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. వరద సహాయక చర్యల నిమిత్తం ఇప్పటికే గీతా ఆర్ట్స్ సంస్థ, మహేష్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్ అందరూ తలా పాతిక లక్షలు విరాళం ఇప్పటికే ప్రకటించారు. తాజాగా బాహుబలితో ప్యాన్ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. గతంలో కూడా ప్రభాస్ అనేక సార్లు ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రభుత్వాలకు భారీగా విరాళాలు ప్రకటించారు.
Read more: మరో రిమేక్‌లో నటించనున్న వెంకీమామ…!ఈ సారి స్టార్ డైరెక్టర్‌తో….ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా విడుదలకి సిద్దంగా ఉంది. ప్రభాస్ ఇప్పటికే ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె(వర్కింగ్ టైటిల్), స్పిరిట్ చిత్రాలు కమిట్ అయ్యారు. టాలివుడ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక్కో చిత్రానికి 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడు ప్రభాస్