భారీగా పడిపోయిన సలార్ కలెక్షన్స్… 19వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?

January 10, 2024

భారీగా పడిపోయిన సలార్ కలెక్షన్స్… 19వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే అప్పటికే 3 వరుస ఫ్లాప్ సినిమాలతో అభిమానులను తీవ్ర నిరాశపరచినటువంటి ప్రభాస్ సలార్ సినిమా ద్వారా ఎన్నో అంచనాలు నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైనటువంటి విజయాలను సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా కొన్ని ప్రాంతాలలో అనుకున్న స్థాయిలో ప్రేక్షకులు అంచనాలను చేరుకోలేకపోయింది అలాగే కలెక్షన్ల పరంగా కూడా కొంతమేర నష్టాలను మిగిల్చింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇకపోతే 19వ రోజు వీకెండ్ అయినప్పటికీ ఈ సినిమా కలెక్షన్లపై పెద్దగా ప్రభావం చూపించలేదని తెలుస్తోంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 19వ రోజు ఎంత మొత్తంలో కలెక్షన్స్ రాబట్టింది అనే విషయానికి వస్తే..

ఈ సినిమా అన్ని ప్రాంతాలలోనూ కలిపి 345 కోట్ల బిజినెస్ జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 19వ రోజు కలెక్షన్స్ పరంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కేవలం రూ. 15 లక్షలు షేర్ మాత్రమే వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ప్రాంతాలను కలిపితే ఇది రూ. 68 లక్షలు షేర్ మాత్రమే రాబట్టినట్టు సమాచారం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం 700 కోట్లు దాటాయని తెలుస్తోంది.

ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ 1000 కోట్లు రీచ్ అవ్వడం కాస్త కష్టతరంగానే అనిపిస్తుంది. ఈ సంక్రాంతి పండుగకు స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నటువంటి తరుణంలో ఆ సినిమాల ప్రభావం సలార్ సినిమాపై చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంతో 1000 కోట్ల టార్గెట్ అనేది ప్రభాస్ సినిమాకు కష్టతరమే అని చెప్పాలి. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే రెండవ భాగం షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది.

Read More: అయ్యో తమన్.. మళ్లీ బలి.. స్టేజ్ పర్ఫామెన్స్‌తో ట్రోలింగ్

ట్రెండింగ్ వార్తలు