`ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి మ‌ణిహారంలాంటి `జ‌న‌నీ..` పాట చూశారా?

November 26, 2021

`ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి మ‌ణిహారంలాంటి `జ‌న‌నీ..` పాట చూశారా?
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం రణం రుధిరం)’. ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ప్రమోషన్స్‌ ప్రారంభించింది. ఇప్ప‌టికే రిలీజ్ చేసిప రెండు పాట‌లు విశేష ఆద‌ర‌ణ ద‌క్కించుకున్నాయి. ఇక మూడోపాట‌గా జ‌న‌నీ ప్రియ భార‌త జ‌న‌నీ... దేశ‌భ‌క్తి గీతాన్ని రిలీజ్ చేశారు. ఈ పాట‌లో రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌, అజ‌య్ దేవ‌గ‌న్‌, శ్రేయ క‌నిపించారు. ఎంతో ఎమోష‌న‌ల్‌గా సాగే ఈ పాట‌ను ఒక రోజు ముందే మీడియాకు ప్ర‌ద‌ర్శించాడు రాజ‌మౌళి.ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ – ‘‘జనని’ పాట ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి ఓ సోల్‌. ఈ పాట కోసం కీరవాణి అన్నయ్య రెండు నెలలు శ్రమించారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్ కూడా రాశారు. డిసెంబర్‌ మొదటి వారంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ విడుదల చేస్తాం. సినిమా ప్రమోషన్స్‌ భారీగానే ప్లాన్‌ చేశాం. వచ్చే నెలలో వరుసగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్లకు ఏర్పాట్లు చేస్తున్నాం. నటీనటులు, మెయిన్‌ టెక్నిషియన్స్‌.. ఇలా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ మొత్తం త్వరలోనే మీ ముందుకు వస్తాం. మీ ప్రశ్నలన్నింటికీ మేము సమాధానం చెబుతాం’ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు