ప్రభాస్‌కు ముఖం చాటేసిన రాజమౌళి

December 17, 2021

ప్రభాస్‌కు ముఖం చాటేసిన రాజమౌళి

ప్రజెంట్‌ ప్రభాస్‌ ప్యాన్‌ ఇండియన్‌ యాక్టర్‌ స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నాడు అంటే దానికి ఎంతో కొంత దర్శకుడు రాజమౌళి కారణం. రెండు భాగాలుగా రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా వచ్చిన ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు రాజమౌళి, ప్రభాస్‌ల మధ్య విభేదాలు వచ్చాయనే టాక్‌ వినిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 23న ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకలో ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్‌ ఫ్యాన్స్‌ లాంచ్‌ చేయనున్నారు. దీన్ని బట్టి ‘రాధేశ్యామ్‌’ ఫంక్షన్‌కు రాజమౌళి రానట్లేనని ఊహించుకోవచ్చు. అయినా బాలకృష్ణ ‘అఖండ’, అల్లుఅర్జున్‌ ‘పుష్ప’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లకు వెళ్లిన రాజమౌళి..తనను ప్యాన్‌ ఇండియన్‌ డైరెక్టర్‌గా చెప్పుకునేలా చేసిన ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ సినిమాకు అతిథిగా వెళ్లకపోవడం ఏంటో! రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. అయితే సినిమా విడుదల తేదీని మార్చుకోవాల్సినదిగా ప్రభాస్‌ను రాజమౌళి కోరినప్పటికీని అందుకు ప్రభాస్‌ అండ్‌ కో ఒప్పుకోలేదట. దీంతో హారై్టన రాజమౌళి రాధేశ్యామ్‌ ప్రీ రిలీజ్‌కు కావాలనే డుమ్మా కొట్టారనే టాక్‌ ఫిల్మ్‌ నగర్‌లో వినిపిస్తుంది. మరి..మధ్యవర్తులేవరైనా రాజమౌళిని కన్విన్స్‌ చేస్తే తప్ప..రాధేశ్యామ్‌ ఫంక్షన్‌లో రాజమౌళి కనిపించరు.

ట్రెండింగ్ వార్తలు