రామ్ చరణ్ బర్త్ డే కి సర్ప్రైజ్ గిఫ్ట్ అదేనా!

March 15, 2024

రామ్ చరణ్ బర్త్ డే కి సర్ప్రైజ్ గిఫ్ట్ అదేనా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కి గేమ్ చేంజర్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ రాబోతుందంట. నిజానికి గత కొంతకాలంగా మెగా ఫ్యాన్స్ ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద అందరికీ అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే అటు శంకర్ కానీ ఇటు దిల్ రాజు గాని ఈ సినిమా గురించిన అప్డేట్స్ ఏవీ అనౌన్స్ చేయడం లేదు.

దీంతో చరణ్ అభిమానులు ఒకింత నిరాశకు గురయ్యారని చెప్పొచ్చు. అయితే ఈమధ్య దిల్ రాజు ఓ ఫంక్షన్ లో మాట్లాడుతూ ఈ మంత్ లో మన రామ్ చరణ్ గారి బర్త్ డే ఉంది కదా ఆరోజు మీకోసం గేమ్ చేజర్ నుంచి కంటెంట్ రాబోతుంది అని అనౌన్స్ చేశారు. అయితే ఆరోజు గేమ్ చేజర్ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేస్తారా..

లేక సాంగ్ రిలీజ్ చేస్తారా అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో ఏర్పడింది. గతంలో రిలీజ్ చేస్తామని చెప్పినా జరగండి సాంగ్ నే చరణ్ బర్త్ డే నాడు రిలీజ్ చేస్తే చాన్స్ ఉంది అంటున్నారు సినీ వర్గాల వారు. నిజానికి ఈ సాంగ్ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది.

కానీ ముందే లీక్ అయిన కారణంగా ఈ సాంగ్ పై ట్రోల్స్ జరగటంతో రిలీజ్ చేయలేదు. అయితే అదే రోజు సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు అనే వార్త కూడా ఒకటి బయటకు వచ్చింది. అయితే అది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. అయితే తమన్ కూడా చరణ్ బర్త్ డే రోజు గేమ్ చేంజర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతుందని చెప్పాడు. ఈ సినిమాలో కేవలం పాటల కోసమే 90 కోట్లు ఖర్చు పెట్టారని సినీ వర్గాల సమాచారం.

Read More: వేసవిలో వినోదాల విందు!

ట్రెండింగ్ వార్తలు