`ఆర్ఆర్ఆర్’ నుంచి రామ్, భీమ్ కొత్త స్టిల్స్… పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్…

December 28, 2021

`ఆర్ఆర్ఆర్’ నుంచి రామ్, భీమ్ కొత్త స్టిల్స్… పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్…

NTR and Ramcharan latest stills from RRR: రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ ఆర్ ఆర్’ జనవరి 7వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో చెర్రీ, తారక్, రాజమౌళి బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అటు నార్త్‌ను, ఇటు సౌత్‌ను బ్యాల‌న్స్ చేస్తూ ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో ప్రమోషన్స్‌కి సంబంధించిన ప్రెస్ మీట్స్ నిర్వహించారు. చెన్నైలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో దర్శకుడు రాజమౌళి ఒకింత భావోద్వేగానికి గురై హీరోలు రాంచరణ్ తారక్‌పై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి .. ఎన్టీఆర్ .. చరణ్ ముగ్గురూ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో తీరిక లేకుండా ఉన్నారు.

తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో రాంచరణ్, తారక్ లుక్స్‌కి సంబంధించి కొత్త స్టిల్స్ విడుదలయ్యాయి. పోలీస్ గెటప్‌లో రాంచరణ్, బ్లూ షర్ట్-ధోతీ గెటప్‌లో ఎన్టీఆర్ లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. రామ్, భీమ్ పాత్రలకు సంబంధించిన ఈ స్టిల్స్‌ అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ ట్విట్టర్ ఖాతాలో ఈ స్టిల్స్‌ను పోస్ట్ చేశారు.

ఈ సినిమాలో రాంచరణ్ సరసన అలియా భట్, తారక్ సరసన ఒలీవియా మోరిస్‌ నటిస్తున్నారు. అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, శ్రేయ స‌ర‌న్ కీల‌క పాత్రల్లో క‌నిపించ‌నున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు