400మంది డ్యానర్లతో రామ్‌చరణ్‌ సాంగ్‌ షూట్‌

July 4, 2022

400మంది డ్యానర్లతో రామ్‌చరణ్‌ సాంగ్‌ షూట్‌

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ అమృత్‌సర్‌లో జరుగుతోంది. రామ్‌చరణ్‌ పై ఇంట్రోసాంగ్‌ను తీస్తున్నారు. గణేష్‌ ఆచార్య కొరియోగ్రాఫర్‌. ఈ సాంగ్‌తో దాదాపు 400మంది బ్యాగ్రౌండ్‌ డ్యాన్సర్స్‌ ఉంటారు. శంకర్‌ సినిమాలోని సాంగ్స్‌ అంటే గ్రాండ్‌ విజువల్స్‌తో రిచ్‌గా ఉంటాయి. సేమ్‌ విజవల్‌ ట్రీట్‌ ఈ సాంగ్‌లోనూ కనిపిస్తుందట. అయితే అమృత్‌సర్‌లోని గుర్‌నానక్‌ యూనీవర్సిటీలో జరుగుతున్న ఈ సాంగ్‌ పూర్తి చిత్రీకరణ ఇక్కడే కాదు. కొంత ఇక్కడ, మరికొంత విశాఖపట్నంలో షూట్‌ చేస్తారు.

హీరో ఇంట్రోసాంగ్‌ కాబట్టి ఈ చిత్రీకరణలో ఈ సినిమా హీరోయిన్‌ కియారా అద్వానీ పాల్గొనడం లేదు. ఈ చిత్రంలో సునీల్, నవీన్‌చంద్ర, జయరామ్, అంజలి, శ్రీకాంత్‌ కీ రోల్స్‌ చేస్తున్నారు. రాజకీయ వ్యవస్థలో నిజాయితీగల ఐఏఎస్‌ ఆఫీసర్లు ఎలా ఇబ్బంది పడుతున్నారు? అన్న కోణంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో తమిళ దర్శక–నటుడు ఎస్‌జే సూర్య సీఎమ్‌ పాత్రలో కనిపిస్తారు. ఆల్రెడీ టెస్ట్‌ షూట్‌ జరిగింది. ఇక దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది

ట్రెండింగ్ వార్తలు