వీకెండ్ వస్తే రష్మిక ఆ పని చేస్తుందా.. మంచి అలవాటే అంటున్న నేటిజన్స్?

April 1, 2024

వీకెండ్ వస్తే రష్మిక ఆ పని చేస్తుందా.. మంచి అలవాటే అంటున్న నేటిజన్స్?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి వారిలో నటీ రష్మిక మందన్న ఒకరు. ఇలా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె ఇక్కడ కూడా వరుస సినిమా అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి రష్మిక అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమాలో నటించారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ లభించింది. దీంతో బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇలా వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తున్నారు.

ఇక త్వరలోనే ఈమె పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా పట్ల పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా రష్మికకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక స్టార్ హీరోయిన్గా ఏమాత్రం తీరిక లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

ఇలా సినిమా పనులలో బిజీగా ఉండే ఈమె వీకెండ్ మాత్రం సినిమాలకు సంబంధించి ఎలాంటి పనులు చేయరని తెలుస్తుంది. వీకెండ్ లో తన కుటుంబానికి ఇవ్వాల్సిన టైం ఇస్తూ వారితో గడపడమే కాకుండా మిగిలిన సమయం మొత్తం తన స్నేహితులతోనే గడుపుతూ ఉంటారట. ప్రతి వీకెండ్ రష్మిక తన స్నేహితులతో గడపడం అలవాటు చేసుకున్నారని ఆరోజు మొత్తం తనకు ఎలా అయితే నచ్చుతుందో అలాగే గడుపుతూ ఉంటారని తెలుస్తుంది.

Read More: ఆస్తులు మళ్లీ తన పేరు పై రాయించిన నయనతార… ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది?

ట్రెండింగ్ వార్తలు