డార్లింగ్ పార్టీ కావాలంటున్న రష్మిక.. విజయ్ సమాధానం ఏంటో తెలుసా?

March 29, 2024

డార్లింగ్ పార్టీ కావాలంటున్న రష్మిక.. విజయ్ సమాధానం ఏంటో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇక ఈయన రహస్యంగా రష్మికతో ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. రష్మిక విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఈ రెండు సినిమాలలో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతో అద్భుతంగా వర్కౌట్ కావడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా వీరిద్దరూ కలిసి తరచూ వెకేషన్ లోకి వెళ్లడంతో ఈ రూమర్లు మరింత వైరల్ అవుతున్నాయి. ఇలా తమ గురించి ఇలాంటి రూమర్స్ వచ్చినప్పటికీ ఈ వార్తలను మాత్రం వీరిద్దరూ ఖండించిన సందర్భాలు లేవనే చెప్పాలి.

ఇలా రష్మిక విజయ్ దేవరకొండ గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె మై డార్లింగ్ అంటూ విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ పరశురామ్ డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల అయింది.

ఈ సినిమా ట్రైలర్ ను రష్మిక తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ మై డార్లింగ్స్ విజయ్ దేవరకొండ పరశురాంకి బెస్ట్ విషెస్ ఫ్యామిలీ స్టార్ తప్పకుండా సక్సెస్ అవుతుంది నాకు పార్టీ ఇవ్వాలి . ఆల్ ది బెస్ట్ మై లవ్ మృణాల్ అంటూ ఈమె చేసినటువంటి పోస్ట్ సంచలనంగా మారింది. ఇక ఈ వీడియోని విజయ్ దేవరకొండ రీ పోస్ట్ చేస్తూ క్యూటెస్ట్ అంటూ రిప్లై ఇచ్చారు. ఇలా వీరి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరోసారి రిలేషన్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.

Read More: ఎట్టకేలకు ఓటీటీ లో విడుదల కాబోతున్న హీరామండీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే!

ట్రెండింగ్ వార్తలు