ఆర్‌ఆర్‌ఆర్ వాయిదా..జోరు చూపిస్తున్న చిన్న సినిమాలు

January 1, 2022

ఆర్‌ఆర్‌ఆర్ వాయిదా..జోరు చూపిస్తున్న చిన్న సినిమాలు

RRR Postponed: ఈ నూత‌న సంవ‌త్స‌రం సినీ అభిమానుల‌కు నిరాశే మిగిల్చింది. గ‌త కొంత కాలంగా ఎన్నో క్లిష్ట పరిస్థితులను దాటుకుని జనవరి 7న విడుదలకు సిద్ధమైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మ‌ళ్లీ వాయిదా పడింది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ద‌ర్శ‌క‌ధీరుడికి సైతం ఈ సినిమా విడుదలను వాయిదా వేయటం తప్ప తమకు మరో మార్గం లేక‌పోయింది. “ఎంతో కష్టపడి అవిశ్రాంతంగా పనిచేసినా, కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. అనేక రాష్ట్రాల్లో థియేటర్లు మూతబడుతున్నాయి. సినిమా విడుదల వాయిదా వేయటం తప్ప మరో మార్గం లేదు. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. ఆలస్యమైనా ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తాం. ఇండియన్‌ సినిమా వైభవాన్ని సరైన సమయంలో మళ్లీ మీ ముందుకు తీసుకొస్తామని హామీ ఇస్తున్నాం’’ అని ఆర్ఆర్ఆర్‌ టీమ్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది.

దాదాపు రూ.400కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆ వ‌సూళ్ల‌ను అందుకోవ‌డ‌మే క‌ష్టం. ఇలాంటి ప‌రిస్థితుల్లో అనేక రాష్ట్రాల్లో థియేట‌ర్స్ మూతబడుతున్నాయి. దాంతో ఈ చిత్రం సంక్రాంతి బ‌రినుండి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. అయితే మ‌రో ప్యాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ విడుద‌ల‌తేదిలో ఎలాంటి మార్పులేదు..దాంతో ఈ సంక్రాంతికి చిన్న సినిమాల జోరు మరింత పెరిగే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు