ఆర్ ఆర్ ఆర్ రన్ టైం ఎంతో తెలుసా..?
November 26, 2021
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్ (రౌద్రం రణం రుధిరం)’. ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిప రెండు పాటలు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఈ రోజు విడుదల చేసిన మూడోపాట `జననీ ప్రియ భారత జననీ…`కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా ఎలాగు విజవల్ వండర్ అని తెలుస్తోంది. అలాగే ఈ సారి రాజమౌళి యాక్షన్, డ్యాన్స్‌లతో పాటు ఎమోషన్స్‌ను మరింత బాగా చూపించారట. అయితే ఈ సినిమాకు నిడివి ఒక్కటే సమస్య అని తెలుస్తోంది.‘బాహుబలి: ద బిగినింగ్’ సినిమా రన్ టైమ్ 2.39 గంటలు..బాహుబలి ద కంక్లూజన్ రన్ టైమ్… ‘2.47 గంటలు. దాదాపు రాజమౌళి సినిమాలు అన్ని ఇప్పటివరకు మూడు గంటలలోపే ఉన్నాయి. అయితే ఆర్ ఆర్ ఆర్ నిడివి మాత్రం మూడుగంటలకు పైనే..అవును ఆర్ ఆర్ ఆర్ రన్ టైమ్ అక్షరాల మూడు గంటల ఆరు నిమిషాలు. ఇద్దరు హీరోల యాక్షన్ సీన్లను బ్యాలన్స్ చేయడానికి ఈ సారి రాజమౌళి నిడివి విషయంలో కాంప్రమైజ్ అయినట్టు తెలుస్తోంది. అయితే అంత రన్ టైమ్ ఉన్నా సినిమా ఎక్కడా అలా అనిపించదు అని అంటున్నారు. అలాగే ఈ సినిమాకు ఎలాంటి కట్స్ చెప్పకుండా యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. డిసెంబర్ తొలి వారంలో ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఒకటి కంటే ఎక్కువ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు.