రామ్‌ ప్లాన్‌ను అడ్డుకున్న సాయిపల్లవి..హెల్ప్‌ చేసిన సూర్య!

July 3, 2022

రామ్‌ ప్లాన్‌ను అడ్డుకున్న సాయిపల్లవి..హెల్ప్‌ చేసిన సూర్య!

తెలుగులో హీరో రామ్‌కు మంచి క్రేజ్‌ ఉంది. ‘ఇస్మార్ఠ్‌ శంకర్‌’ హిట్‌తో రామ్‌ క్రేజ్‌ మరింత పెరిగింది. దీంతో తమిళంలోనూ మార్కెట్‌ పెంచుకోవాలని రామ్‌ డిసైడ్‌ అయ్యారు. ఇందులో భాగంగానే తమిళ దర్శకుడు లింగుసామీతో ‘ది వారియర్‌’ అనే తీశారు. కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు.

శ్రీనివాస చిట్టూరి నిర్మాత. తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమా జూలై 14న థియేటర్స్‌లో రిలీజ్‌ అవుతుంది. కానీ ఇప్పుడు అనూహ్యాంగా సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన ‘గార్గి’ చిత్రం రిలీజ్‌కు రెడీ అయ్యింది. తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో ‘గార్గి’ చిత్రం జూలై 15న థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నారు.

గౌతమ్‌ రామ చంద్రన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘గార్గి’ సినిమాను తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో సూర్య విడుదల చేస్తున్నారు. దీంతో తమిళంలో మంచి క్రేజ్‌ సంపాదించుకుందాము అనుకున్న రామ్‌కు సాయిపల్లవి ‘గార్గి’ చిత్రం అడ్డుగా నిలుస్తోంది. రవి చంద్రన్‌ రామచంద్రన్, ఐశ్వర్య లక్ష్మీ, థామస్‌ జార్జి ‘గార్గి’ సినిమాకు నిర్మాతలు

ట్రెండింగ్ వార్తలు