November 26, 2021
నాగచైతన్యతో విడాకులు తర్వాత పూర్తిగా కెరీర్‌పై దృష్టిసారించింది సమంత. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ్ లో రెండు విడుదలకి సిద్దంగా ఉన్నాయి. అలాగే మరో రెండు ప్రాజెక్ట్స్‌కి పచ్చజెండా ఊపింది. వాటితో పాటు పుష్ప సినిమాలో బన్నీ సరసన స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. అయితే ఇప్పుడు ఏకంగా ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కి ఒకే చెప్పింది సామ్.
ఫిలిప్ జాన్ దర్శకత్వంలో ఓ ఇంటర్నేషనల్ సినిమా చేయబోతోంది..ఇందులో సమంత… బై-సెక్సువల్ తమిళ అమ్మాయిగా కనిపించబోతోందట. భారతీయ రచయిత ఎన్.మురారి రాసిన ఎరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ పుస్తకానికి నవలా రూపం ఈ చిత్రం. 2004లో అత్యధికంగా అమ్ముడైన నవల ఇది. తమిళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్ లాంటి భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆగస్ట్, 2022లో ఈ సినిమా ప్రారంభం కానుంది.