బ్యాక్ మొత్తం చూపిస్తూ ఈ డ్రెస్సులో అలా ఉన్నాను అంటున్న సమంత?

March 22, 2024

బ్యాక్ మొత్తం చూపిస్తూ ఈ డ్రెస్సులో అలా ఉన్నాను అంటున్న సమంత?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు చిన్న విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. గతంలో ఈమె పెద్ద ఎత్తున సినిమాలకు కమిట్ అవుతూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే తన ఆరోగ్య సమస్యల కారణంగా ఈమె ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ఈమె తన ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడ్డారని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల ఈ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు నిర్వహించినటువంటి ఓ కార్యక్రమానికి హాజరైన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత ధరించిన డ్రెస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఈ డ్రెస్ లో ఈమె ఫోటో షూట్స్ చేయించి అందుకు సంబంధించిన ఫోటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇందులో భాగంగా బ్యాక్ మొత్తం చూపెడుతూ హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఇక ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి సమంత ఈ డ్రెస్ లో నేను వారియర్ ప్రిన్సెస్ లా ఉన్నానని ఫీలవుతున్నాను అంటూ తన మనసులోని ఆలోచనలను బయటపెడుతూ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ డ్రెస్ ను తనకు ప్రీతమ్ జుకాల్కర్ డిజైన్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలను సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు కొందరు చాలా అందంగా ఉన్నారు అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు పక్షి ఈకల మాదిరిగా ఈ డ్రెస్సు ఏంటి సమంత అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Read More: బన్నీలో ఉన్నటువంటి ఈ క్వాలిటీ చరణ్ లో లేదు తెలుసా.. గమనించారా?

ట్రెండింగ్ వార్తలు