సమంత సినిమా వాయిదా..హ్యాపీ మూడ్‌లో నితిన్‌

July 11, 2022

సమంత సినిమా వాయిదా..హ్యాపీ మూడ్‌లో నితిన్‌

సమంత ప్రధాన పాత్రలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నిముకుందన్, రావురమేష్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘యశోద’. హరి– హరీష్‌ ద్వయం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టాకీపార్టు పూర్తయినట్లుగా చిత్రబృందం ప్రకటించింది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను తొలుత ఆగస్టు 12న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ యశోద సినిమా వాయిదా పడింది. ఇటు అఖిల్‌ ‘ఏజెంట్‌’ను ఆగస్టు 12న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఈ చిత్రం కూడా వాయిదా పడింది. దీంతో నితిన్‌ హ్యాపీ ఫీలవుతున్నాడు.

ఎందుకంటే నితిన్‌ హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ఆగస్టు 12న రిలీజ్‌కు రెడీ అవు తుంది. రెండు పెద్ద బడ్జెట్‌ సినిమాలు పోటీకి తప్పుకుని ఆల్మోస్ట్‌ సోలో రిలీజ్‌ అంటే నితిన్‌ హ్యాపీయే మరి. పైగా మాచర్ల నియోజకవర్గం చిత్రం సొంత బ్యానర్‌ లో రూపొందిన మూవీ మరి. కృతీశెట్టి హీరోయిన్‌గా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాకు రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడు. ఇందులో కలెక్టర్‌ సిద్దార్థ్‌ రెడ్డి పాత్రలో కనిపిస్తారు నితిన్‌.

ట్రెండింగ్ వార్తలు