ఆ హీరోనే నా క్రష్ అంటున్న సమంత.. ఎవరా హీరో?

March 18, 2024

ఆ హీరోనే నా క్రష్ అంటున్న సమంత.. ఎవరా హీరో?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఇండస్ట్రీకి విరామం ప్రకటించి తన ఆరోగ్యాన్ని సంరక్షించుకునే పనులలో బిజీగా ఉన్నారు. ఈ విధంగా సమంత వివిధ దేశాలకు వెళుతూ తన సమస్యకు చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడే అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈమె సినిమా ఇండస్ట్రీకి విరామం ప్రకటించిన సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

సోషల్ మీడియా వేదికగా సమంత తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే ఇప్పుడిప్పుడే ఈమె ఈ వ్యాధి నుంచి బయటపడటంతో తిరిగి ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా సమంత ఇండియా టుడే కాన్ క్లేవ్ 2024 కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కంటే ముందుగా సమంత ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయితే ఈమె ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోల గురించి చెప్పినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో షారుఖ్ ఖాన్ అంటే తనకు చాలా గౌరవమని తెలిపినటువంటి సమంత టాలీవుడ్ హీరోల గురించి కూడా కామెంట్లు చేశారు..

ఇక ఈమె ఇప్పటివరకు ప్రభాస్ తో కలిసి ఒక సినిమాలో కూడా నటించలేదు కానీ తనకు ప్రభాస్ అంటే చాలా గౌరవం ఉందని ప్రభాస్ పట్ల తన అభిప్రాయాన్ని సమంత తెలియజేశారు. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి అల్లు అర్జున్ నా క్రష్ అంటూ సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సమంత గతంలో కూడా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఆయన తన సినీ రోల్ మోడల్ అని తెలియజేశారు. ప్రస్తుతం తనే నా క్రష్ అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ గా మారడంతో బన్నీ ఫాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More: ఉస్తాద్ నుంచి సడన్ సర్ప్రైజ్.. టీజర్ ముహూర్తం ఫిక్స్?

ట్రెండింగ్ వార్తలు