సమంత విషయంలో ఆ వార్తే నిజమైంది..

July 5, 2022

సమంత విషయంలో ఆ వార్తే నిజమైంది..

దక్షిణాదిలో హీరోయిన్‌గా సమంత క్రేజ్‌కు ఎదురులేదు. ఇటు ఉత్తరాదిలో కూడా ‘ది ఫ్యామిలీమ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌తో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు సమంత. అయితే హిందీ ఫీచర్‌ ఫిల్మ్‌లో మాత్ర సమంత ఇంత వరకు నటించింది లేదు. తాప్సీ నిర్మాణసంస్థ అవుట్‌సైడర్‌ ఫిలింస్‌లో సమంత ప్రధాన పాత్రధారిగా ఓ సినిమా తెరకెక్కనుందనే వార్త ఎప్పట్నుంచో నెట్టింట్లో తిరుగుతూనే ఉంది. ఎట్టకేలకు ఈ వార్తే నిజం అయ్యింది. తన నిర్మాణసంస్థలో ఓ సినిమా చేసేందుకు సమంత అంగీకరించినట్లుగా తాప్సీ చెప్పారు.

Read More: GodFather First Look : సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో మెగా మార్వెలెస్

తాప్సీ ప్రధాన పాత్ర పోషించిన బయోపిక్‌ ‘శభాష్‌ మీతూ’ ఈ నెల 15న విడుదల అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాప్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. భారత మాజీ మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవితం ఆధారంగా ‘శభాష్‌ మీతూ’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇటు సమంత నటించిన ‘శాకుంతలం’, యశోద చిత్రాలు రిలీజ్ కు రెడీగా రెడీగా ఉన్నాయి. ఇక శివ నిర్మాణ దర్శకత్వంలో సమంత, విజయ్‌దేవరకొండ నటిస్తున్న ఖుషి చిత్రం సెట్స్‌పై ఉన్న సంగతి తెలిసిందే..

ట్రెండింగ్ వార్తలు