సీతారామం కాంబినేష‌న్ రిపీట్‌!

August 30, 2022

సీతారామం కాంబినేష‌న్ రిపీట్‌!

దుల్కర్‌ సల్మాన్, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సీతారామం’. ఈ సినిమా థియేటర్స్‌లో ఆగస్టు 5, 2022న విడుదలై బంపర్‌హిట్‌ సాధించింది. ఇప్పటికీ ఈ సినిమా కొన్ని థియేటర్స్‌లో ఆడుతూనే ఉంది. ఈ సినిమాను వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే హీరో హీరోయిన్లు దుల్కర్, మృణాళ్, దర్శకుడు హనురాఘవపూడి కాంబినేషన్‌లోనే మరో సినిమా ను ప్లాన్‌ చేసిందట వైజయంతీ మూవీస్‌ సంస్థ. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ స్టార్ట్ అయ్యాయని తెలిసింది. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్‌ మొదలవుతుంది. అనుకున్న సమయానికి సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయితే 2024లో ఈ సినిమా ఉండొచ్చు.

ట్రెండింగ్ వార్తలు