సుకుమార్ చరణ్ సినిమాపై రాజమౌళి కామెంట్స్.. అప్పుడే షూట్ కూడా చేశారా?

March 26, 2024

సుకుమార్ చరణ్ సినిమాపై రాజమౌళి కామెంట్స్.. అప్పుడే షూట్ కూడా చేశారా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తూ ఉన్నారు. ఈ సినిమా తర్వాత తన 16వ చిత్రాన్ని బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు జరగబోతున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే రాంచరణ్ తన తదుపరి సినిమా గురించి అప్డేట్ తెలిపారు.

రామ్ చరణ్ తన 17వ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించారు. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో పుట్టినరోజుకు ఒకరోజు ముందుగానే తన కొత్త సినిమాను ప్రకటించి అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారని చెప్పాలి. ఇక ఇప్పటికే రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో రంగస్థలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా సక్సెస్ కావడంతో తిరిగి ఈ కాంబినేషన్లో సినిమా కోసం చరణ్ ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే ఇటీవల రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో సినిమాని అనౌన్స్ చేయడంతో గతంలో ఈ సినిమా గురించి రాజమౌళి చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించినటువంటి RRR సినిమా ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ రామ్ చరణ్ ఈ సినిమాలో ఎంట్రీ సీన్ ఎంతో అద్భుతంగా ఉంది అయితే అలాంటి లుక్ లోనే సుకుమార్ సినిమా చేయబోతున్నారని అందుకే చరణ్ ఆ లుక్ తో కొంత భాగం షూట్ కూడా చేశారంటూ ఈయన చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇలా రాజమౌళి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అంటే సుకుమార్ చరణ్ కాంబినేషన్లో రాబోయే సినిమాలో కొన్ని సన్నివేశాలు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాయా అని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటేనే ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు కూడా పెరిగిపోయాయి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.

Read More: ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి రోజులు ఉంటాయి.. అందుకే ఇది నాకు ప్రత్యేకం: సమంత

ట్రెండింగ్ వార్తలు