నేను అలా అనలేదు… జనసేనా ప్రచార విషయంపై క్లారిటీ ఇచ్చిన అనసూయ?

March 29, 2024

నేను అలా అనలేదు… జనసేనా ప్రచార విషయంపై క్లారిటీ ఇచ్చిన అనసూయ?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ సినిమా అవకాశాలను అందుకొని వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా అవకాశాలు రావడంతో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు. ఇలా బుల్లితెరకు దూరమైనటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె చేసినటువంటి పొలిటికల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాను పవన్ కళ్యాణ్ పిలిస్తే జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలను చేస్తాను అంటూ ఈమె కామెంట్లు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలను జనసేన నాయకులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేసి సంతోషం వ్యక్తం చేయగా మరికొందరు మాత్రం భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

ఈ విధంగా అనసూయ గురించి వస్తున్నటువంటి ఈ ట్రోల్స్ పై ఈమె ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయబోతున్నారట కదా నిజమేనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ నేనెక్కడ కూడా జనసేనకు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తానని చెప్పలేదు.

నేను పలానా పార్టీకే సపోర్ట్ చేస్తానని చెప్పలేదు నాయకుడు మంచోడు అయితే ఏ పార్టీ నుంచి తనకు పిలుపు వచ్చిన సపోర్ట్ చేస్తానని తెలిపాను. పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్ ఆయన పిలిస్తే ప్రచారం చేస్తాను కానీ నా అంతట నేను వెళ్లి ప్రచారం చేయను అలాగని పవన్ కళ్యాణ్ కు మాత్రమే కాకుండా ఇతర పార్టీలో కూడా కొంతమంది లీడర్స్ ఉన్నారని అలాంటివారు పిలిస్తే ప్రచారం చేస్తానని తెలిపారు. అయినా ఈ మధ్యకాలంలో నేను ఏం మాట్లాడినా పెద్ద ఎత్తున కాంట్రవర్సీ చేస్తున్నారు అంటూ ఈ సందర్భంగా అనసూయ పొలిటికల్ కామెంట్స్ గురించి క్లారిటీ ఇస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Read More: చిరంజీవితో ఆ పాటకు డాన్స్ చేయటం కోసం కష్టపడ్డాను.. రాధా కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు