మొదలైన తండేల్ పోరాటం.. యాక్షన్ సీక్వెన్స్ లో నాగచైతన్య!

April 5, 2024

మొదలైన తండేల్ పోరాటం.. యాక్షన్ సీక్వెన్స్ లో నాగచైతన్య!

అక్కినేని యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే. కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నాగచైతన్య ఈ సినిమా ద్వారా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. ఇక ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఈయన తన తదుపరి చిత్రాన్ని చందు మొండేటి దర్శకత్వంలో కమిట్ అయ్యారు. ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఒక నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సరిహద్దులు దాటి పాకిస్థాన్లోకి అడుగుపెట్టినటువంటి ఓ జాలరి కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతుంది.

ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా మారబోతుందని సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రముఖ స్టంట్ మాస్టర్ సుప్రీమ్ సుందర్ నేతృత్వంలో జరగబోతుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందని తెలుస్తోంది. ఇలా దేశభక్తి నేపథ్యంలో నిజ జీవిత కథ ఆధారంగా రాబోతున్నటువంటి ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Read More: మీరే నా ఫ్యామిలీ స్టార్.. తప్పు చేసి ఉంటే క్షమించండి నాన్న: విజయ్ దేవరకొండ

ట్రెండింగ్ వార్తలు