April 4, 2024
బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి డైరెక్షన్ లో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న సినిమా రామాయణం. ఈ సినిమాలో రావణాసురుడిగా కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా మంగళవారం ముంబైలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకి మన టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం.
మూడు భాగాలుగా తరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమా షూటింగులో రణబీర్ కపూర్, సాయి పల్లవి యష్ ఇంకా పాల్గొనలేదు. ఫస్ట్ పార్ట్ లో యష్ కనిపించడని, సెకండ్ పార్ట్ నుంచి యష్ కనిపించబోతున్నాడని సినీవర్గాల సమాచారం. అయితే మొదటి భాగం లో రావణాసురుడి పరిచయం మాత్రం ఉంటుందని తెలుస్తుంది.
అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరొక క్రేజీ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. రామాయణం తెలుగు వర్షన్ కి సంభాషణలు అందించే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి అప్పగించినట్లు మూడేళ్ల క్రితమే అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా మళ్లీ ఈ వార్త చర్చనీయాంశమైంది. త్రివిక్రమ్ ఈసినిమాకి మాటలు అందించటానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కరెక్ట్ పర్సన్ అంటున్నారు నెటిజన్స్. కొద్ది మాటల్లో అనంతమైన భావాన్ని పొందికగా చెప్పగల నైపుణ్యం త్రివిక్రమ్ కి ఉంది.
ఆయన సంభాషణలు సినిమా స్థాయిని మరింత పెంచుతాయని మూవీ మేకర్స్ సైతం భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్ వెర్షన్ త్రివిక్రమ్ పూర్తి చేసేసారని వార్తలు వినిపిస్తున్నాయి.దీని గురించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కి ఇంకా రాలేదు. ఈనెల 17వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఐదు భాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులు పదికాలాలపాటు గుర్తుంచుకునేలాగా తెరకెక్కించడం కోసం మూవీ టీం మొత్తం చాలా కసరత్తులు చేస్తున్నట్లు సినీవర్గాల సమాచారం.
Read More: బ్రతికుండగా అలా జరగనివ్వను.. శ్రీదేవి బయోపిక్ పై బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు!