ఓటీటీలోకి గుంటూరు కారం.. అలాంటి డిమాండ్స్ చేస్తున్న ఫ్యాన్స్!

January 30, 2024

ఓటీటీలోకి గుంటూరు కారం.. అలాంటి డిమాండ్స్ చేస్తున్న ఫ్యాన్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రేక్షకులు ముందుకు వచ్చినటువంటి తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా మొదటి నుంచి కూడా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపించుకుంది. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి అభిమానులు కూడా ఈ సినిమా బాధ్యతను తమ భుజాలపై వేసుకొని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ వచ్చారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైనటువంటి ఈ సినిమా టాప్ పరంగా పెద్దగా సక్సెస్ అందుకోలేక పోయినప్పటికీ కమర్షియల్ గా మాత్రం ఎంతో మంచి సక్సెస్ అందుకుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేశారు. అయితే ఈ సినిమాని ఫిబ్రవరి రెండవ వారం నుంచి డిజిటల్ మీడియాలో ప్రసారం చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది అంటూ వస్తున్నటువంటి వార్తలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ సినిమా విషయంలో మాత్రం అభిమానులు సరికొత్త డిమాండ్స్ తెరపైకి తీసుకువస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారం అయ్యే సమయానికి ఇందులో డిలీట్ చేసినటువంటి సన్నివేశాలను అదేవిధంగా చాలా సన్నివేశాలను షూట్ చేసి మరీ పక్కన పెట్టారు. వీటన్నింటినీ కూడా యాడ్ చేసే విడుదల చేయాలి అంటూ డిమాండ్స్ చేస్తున్నారు.

ఇలాంటి సన్నివేశాలను మాత్రమే కాకుండా అన్ కట్ వెర్షన్ కూడా డిజిటల్ మీడియాలో స్ట్రీమింగ్ చేయాలి అంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఓటిటి విడుదల కంటే ముందుగా గుంటూరు కారం సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను విడుదల చేయాలి అంటూ అభిమానులు కోరుతున్నారు. మరి మేకర్స్ ఫాన్స్ డిమాండ్స్ దృష్టిలో పెట్టుకొని వీటన్నింటిని యాడ్ చేసి విడుదల చేస్తారా లేక థియేటర్ వెర్షన్ మాత్రమే విడుదల చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Read More: ఓటీటీలోకి వచ్చేస్తున్న హనుమాన్.. ఎప్పుడు ఎక్కడంటే?

ట్రెండింగ్ వార్తలు