వాలెంటైన్స్ డే స్పెషల్ ఫోటో షేర్ చేసిన ఉపాసన.. అనంతమైన ప్రేమంటూ?

February 14, 2024

వాలెంటైన్స్ డే స్పెషల్ ఫోటో షేర్ చేసిన ఉపాసన.. అనంతమైన ప్రేమంటూ?

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కావడంతో ప్రతి ఒక్కరు కూడా వారి జీవిత భాగస్వామిలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సెలబ్రెటీలు కూడా పెద్ద ఎత్తున వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసన సైతం వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక స్పెషల్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఉపాసన అందరిలా వాలెంటైన్స్ డే రోజు తన భర్త రామ్ చరణ్ ఫోటో కాకుండా విభిన్నంగా ఒక క్యూట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నటువంటి ఈమె తరచు తన కుమార్తెకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈమె రామ్ చరణ్, తన కుమార్తె క్లిన్ కారా, తన చేయి ఉన్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ముగ్గురు కూడా ఒకరి చేతిలో మరొకరి చేతిని వేసి ఉన్నటువంటి ఫోటోని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇలా ఈ ఫోటోని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ అనంతమైన ప్రేమ అనే అర్థం వచ్చేలా ఈ పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చారు. ప్రేమికుల దినోత్సవం అంటే కేవలం జీవిత భాగస్వామి ప్రేమ మాత్రమే కాదు ఇకపై తన భర్త కూతురి ప్రేమ అనే అర్థం వచ్చేలా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పోస్ట్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ విధంగా ఉపాసన షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో పలువురు ఈ పోస్ట్ పై విభిన్న రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడైనా క్లీన్ కారా మొహాన్ని రివిల్ చేస్తారా లేదా.. తనని చూడడం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాము అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మొదటి పుట్టినరోజు వరకు కూడా తన ఫేస్ రివిల్ చేసేలా లేరంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Read More: దానికి నేనెప్పుడూ సిద్ధమే.. అనసూయ బోల్డ్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు