Varun Tej-Lavanya Tripathi | పెళ్లి కోసం ఇటలీ పయనమైన వరుణ్‌-లావణ్య..

October 27, 2023

Varun Tej-Lavanya Tripathi | పెళ్లి కోసం ఇటలీ పయనమైన వరుణ్‌-లావణ్య..
మెగా ఫ్యామిలీలో పెళ్లి ఘంటలు మ్రోగుతున్నాయి. టాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌ తేజ్‌ కొణిదెల, లావణ్య త్రిపాఠి(Varun Tej-Lavanya Tripathi) వివాహ బంధంతో  ఒక్కటి కాబోతున్నారు. జూన్‌లో అంగరంగ వైభవంగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ జంట.. నవంబర్‌ 1వ తేదీన ఇటలీలోని టస్కనీలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేసుకున్నారు. ఈ వేడుకకు అల్లు, మెగా కుటుంబంతో  పాటు మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. పెళ్లికి మరో నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో ఈ జంట ఇటలీకి  పయనమైంది. ఈరోజు ఉదయం హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కాబోయే కొత్త జంట కెమెరాకు చిక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.
Varun Tej-Lavanya Tripathi
పెళ్లి లో భాగంగా అక్టోబర్‌ 30వ తేదీన మెహందీ, హల్దీ వేడుకలు జరగనున్నట్లు తెలుస్తోంది.  వివహానంతరం నవంబర్‌ 5వ తేదీన మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా  రిసెప్షన్‌ జరగనుంది. ఇప్పటికే వరుణ్ లావణ్యల వెడ్డింగ్‌ కార్డ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఆరేళ్ల క్రితం వచ్చిన మిస్టర్ సినిమాలో తొలిసారి వరుణ్, లావణ్య కలిసి నటించారు. ఈ సినిమా నుండే  వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ మరుసటి ఏడాది అంతరిక్షం సినిమాలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఇక అప్పటి నుంచి వీళ్ల స్నేహం కాస్త ప్రేమగా మారిందని సమాచారం. చివరికి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇలా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు వరుణ్ – లావణ్య.

Read More: లియో మూవీ కలెక్షన్స్ పై సెన్సషనల్ కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు