ఆ పెళ్ళికి నన్ను ఎందుకు పిలవలేదు.. ఆనంద్ మహేంద్రాను ప్రశ్నించిన చరణ్.. రిప్లై ఏంటో తెలుసా?

March 25, 2024

ఆ పెళ్ళికి నన్ను ఎందుకు పిలవలేదు.. ఆనంద్ మహేంద్రాను ప్రశ్నించిన చరణ్.. రిప్లై ఏంటో తెలుసా?

ప్రముఖ బిజినెస్మెన్ ఆనంద్ మహేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన బిజినెస్ మెన్ గా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ సోషల్ మీడియాలో చేసే పోస్టులు మాత్రం వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఆనంద్ మహేంద్ర నటుడు రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా జరిగినటువంటి సంభాషణకు సంబంధించిన పోస్టులు వైరల్ గా మారడంతో ఇవి కాస్త ఆసక్తికరంగా మారాయి.

ఇందులో భాగంగా రాంచరణ్ ఆనంద్ మహేంద్రాను ప్రశ్నిస్తూ సుజీత్ పెళ్లికి నన్నెందుకు పిలవలేదు అంటూ చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది దానికి ఆనంద్ మహేందర్ రిప్లై ఇస్తూ ఈ గందరగోళంలో పడి మరిచిపోయాను అంటూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఎవరు ఈ సుజీత్ ,ఈయనని పెళ్లికి ఎందుకు పిలవలేదు అనే విషయానికి వస్తే.. ఆనంద్ మహేంద్ర తమ సంస్థలకు సంబంధించి ఇటీవల ఒక యాడ్ వీడియో చేశారు..

ఇందులో భాగంగా 2040 కార్బన్ న్యూట్రల్ గా మారడమే ఆనంద్ మహేంద్ర లక్ష్యం అంటూ ఆ కంపెనీ ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనను విడుదల చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాదులోని జహీరాబాద్లో ఆనంద మహేంద్ర ఫ్యాక్టరీ నిర్మించడమే కాకుండా లక్షలాది చెట్లను కూడా నాటారని తెలిపారు. రైన్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా నిర్మించినట్టు ఈ వీడియోలో తెలిపారు. దీంతో అండర్ గ్రౌండ్ వాటర్ 400 అడుగులు పెరిగినట్టు వెల్లడించారు.

ఇలా అండర్ గ్రౌండ్ వాటర్ పెరగడంతో జహీరాబాద్ ప్రాంతంలో నీటి సమస్య తగ్గిపోయిందని అందుకే అక్కడ గత కొన్ని సంవత్సరాలుగా నీటి సమస్య కారణంగా పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి సుజిత్ అనే వ్యక్తికి పెళ్లి కుదిరింది అంటూ ఈ వాణిజ్య ప్రకటనలో చూపించారు ఇక ఈ ప్రకటనకు సంబంధించిన వీడియోని రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నన్నెందుకు పిలవలేదని ప్రశ్నించారు. నేను కూడా అక్కడే ఉండేది సరదాగా స్నేహితులతో కలిసి గడిపే వాడిని ఏది ఏమైనా గ్రేట్ వర్క్ అంటూ చరణ్ పోస్ట్ చేసారు.

ఈ పోస్టుకు ఆనంద్ మహేంద్రా రిప్లై ఇస్తూ.. నేను గందరగోళానికి గురై మీకు ఆహ్వానం పంపించడం మర్చిపోయానని నేను అంగీకరిస్తున్నాను. మీ శిక్షణ కారణంగా నేను డాన్స్ ప్రాక్టీస్ చేయడంలో మునిగిపోయాను ఏది ఏమైనా మా ప్రకటన పట్ల స్పందించినందుకు ధన్యవాదాలు అంటూ ఈయన చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

Read More: వెండితెరపై కాలచక్రం.. ప్రేక్షకులను కాలంతో పాటు వెనక్కి తీసుకెళ్తున్న హీరోలు?

ట్రెండింగ్ వార్తలు