విక్రమార్కుడు 2 రాబోతోందా.. ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన ప్రొడ్యూసర్?

March 8, 2024

విక్రమార్కుడు 2 రాబోతోందా.. ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన ప్రొడ్యూసర్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ఒకరు. ఈయన దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమాలలో రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సినిమా కూడా ఒకటి అని చెప్పాలి. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో ఎంతో అద్భుతంగా నటించారు. అనుష్క రవితేజ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం వస్తుందని అందరూ భావించారు. ఇక ఈ విషయం గురించి మన సందర్భాలలో రవితేజ స్పందిస్తూ ఈ సీక్వెల్ సినిమా గురించి ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయలేదని తెలిపారు. అయితే ఈ సినిమా చేయడానికి రాజమౌళి అలాగే రవితేజ ఇద్దరు కూడా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

ఇకపోతే తాజాగా విక్రమార్కుడు సినిమా ప్రొడక్షన్ బ్యానర్ భీమా ప్రొడ్యూస‌ర్ కేకే రాధామోహ‌న్ రియాక్ట్ అవుతూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసారు. విక్ర‌మార్కుడు 2 టైటిల్‌ను మూడు సంవత్సరాల క్రితమే తమ బ్యానర్ పై రిజిస్టర్ చేసి పెట్టమని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాకు డైరెక్టర్ గా సంపత్ నందిని కూడా ఎంపిక చేసామని ఈయన వెల్లడించారు. అయితే రవితేజ ఈ సినిమాని చేయటానికి ఒప్పుకోవడమే ఆలస్యం వెంటనే షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందని వెల్లడించారు.

ఇక ఈ విషయం గురించి నిర్మాత మాట్లాడుతూ అన్ని కాంబినేషన్స్ సరిగా సెట్ అయితేనే ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ ప్రారంభిస్తామని లేకపోతే లేదు అంటూ ఈ సందర్భంగా ఈయన విక్రమార్కుడు గురించి క్లారిటీ ఇచ్చారు అయితే ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు రవితేజ ఇందుకు ఒప్పుకుంటారా ఈ సినిమా సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందా అనే సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

Read More: ఫేస్ బ్లైండ్ నెస్ తో బాధపడుతున్న సుహాస్.. ప్రసన్న వదనం టీజర్ అదిరిందిగా!

ట్రెండింగ్ వార్తలు