చిత్రోత్సవానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరు!

March 19, 2024

చిత్రోత్సవానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరు!

సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ఎంతోమంది సెలబ్రిటీలకు ఆర్టిస్టులకు ఎన్నో రకాల అవార్డులను ప్రకటిస్తూ ఉంటా.రు ఇలా వారికి వివిధ రకాల అవార్డులతో సత్కరించే కేవలం వారిని వారి కెరియర్ పరంగా ఉన్నత ఎదుగుదలకు చేరుకోవాలని అభినందిస్తూ ఇలా అవార్డులను ఇచ్చే వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు.

ఇలా చిత్ర పరిశ్రమలో ఎన్నో అవార్డులను ప్రకటిస్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే త్వరలోనే చిత్రోత్సవ అవార్డు వేడుకలను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. చిత్ర సీమలో ఉత్తేజాన్ని సినీ ఔత్సాహికులలో స్ఫూర్తిని నింపేలా సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ ని నిర్వహిస్తున్నట్టు ఆహా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు ప్రకటించాయి.

ఈ అవార్డు వేడుకలు ఈనెల 22వ తేదీ హైదరాబాదులోనే నోవాటెల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించబోతున్నారు. సినిమాల ప్రదర్శనలు చర్చలతో కూడినటువంటి ఉత్సవాలు చిత్ర పరిశ్రమలో ఎదగాలనుకున్న వారికి, కొత్త విషయాలను నేర్చుకోవాలనుకున్న వారికి ఎంతగానో దోహదం చేస్తాయని నిర్వాహకులు వెల్లడించారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులు కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ అవార్డు వేడుకలలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి విశ్వంభర అనే సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

Read More: గోవాలో దేవర… కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం!

ట్రెండింగ్ వార్తలు