వెంకీ సీక్వెల్ రాబోతోందా.. గుడ్ న్యూస్ చెప్పిన శ్రీను వైట్ల!

March 26, 2024

వెంకీ సీక్వెల్ రాబోతోందా.. గుడ్ న్యూస్ చెప్పిన శ్రీను వైట్ల!

శ్రీను వైట్ల తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరితో కూడా సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఇటీవల కాలంలో శ్రీనువైట్ల సినిమాలకు పెద్దగా కలిసి రాలేదని తెలుస్తుంది అందుకే ఈయనకు సినిమా అవకాశాలు వచ్చిన పెద్దగా సక్సెస్ కాకపోవడంతో క్రమక్రమంగా అవకాశాలు రావడం కూడా ఆగిపోయాయి.

ఈ విధంగా శ్రీను వైట్ల పెద్దగా సినిమాలు చేయడం లేదు చాలా రోజుల తర్వాత ఈయన గోపి చంద్ తో సినిమా చేస్తున్నారు అది కూడా బడ్జెట్ ప్రాబ్లం కారణంగా తరచూ వాయిదా పడుతూ వస్తుంది. ఇకపోతే తాజాగా వెంకీ సినిమా గురించి శ్రీను వైట్ల మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవల వెంకీ సినిమాని తిరిగి రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా చాలా రోజుల తర్వాత ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఇందులో రవితేజ బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఇలా ఈ సినిమాకు థియేటర్లలో మంచి ఆదరణ రావడంతో శ్రీను వైట్ల ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచనలో పడ్డారట.

ఈ విధంగా ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని చేయాలన్న ఆలోచన రావడమే ఆలస్యం ఈయన స్క్రిప్ట్ పూర్తి చేసే పనులలో ఉన్నారని తెలుస్తోంది ఇక ఇదే విషయం గురించి శ్రీను వైట్ల మాట్లాడుతూ ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నానని త్వరలోనే ఈ సినిమాని మీ ముందుకు తీసుకు వస్తానంటూ చెప్పకు వచ్చారు. మరి ఈ సీక్వెల్స్ సినిమాలో హీరోగా రవితేజ నటిస్తున్నారా లేక ఎవరైనా నటిస్తున్నారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

Read More: సుకుమార్ చరణ్ సినిమాపై రాజమౌళి కామెంట్స్.. అప్పుడే షూట్ కూడా చేశారా?

ట్రెండింగ్ వార్తలు