సలార్ కలెక్షన్స్.. వెనకడుగు వేసిందా?.. సైలెంట్ అయిన హాంబలే!

December 28, 2023

సలార్ కలెక్షన్స్.. వెనకడుగు వేసిందా?.. సైలెంట్ అయిన హాంబలే!

Salaar Collections: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన తాజా చిత్రం సలార్(Salaar). ఈ సినిమాకు ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో హోం బలే సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. ఇందులో శృతిహాసన్(Shruthi Haasan) హీరోయిన్గా నటించగా ఝాన్సీ, శ్రీయారెడ్డి,పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు లాంటి వారు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో ఇటీవల డిసెంబర్ 22న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

దీంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమాకు క్యూ కడుతున్నారు. సినిమా విడుదల అయ్యి దాదాపు ఆరు రోజులు కావస్తున్నా కూడా ఇంకా పలుచోట్ల హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కోట్లల్లో కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది. అంతేకాకుండా ప్రభాస్ ఖాతాలో చాలా కాలం తర్వాత సూపర్ హిట్ సినిమా పడటంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా చిత్ర బృందం కూడా సక్సెస్ మీట్ లో భాగంగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే హోం బలే సంస్థ ప్రస్తుతం సైలెంట్ అవడంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలేం జరిగిందంటే గత రెండు రోజులుగా హోమ్ బలే సంస్థ అఫీషియల్ గా పోస్టర్స్ విడుదల చేయకపోవడంతో అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సలార్ కలెక్షన్స్(Salaar Collections) లో వెనుకడుగు వేసిందా అందుకే హోం బలే సంస్థ సైలెంట్ గా ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరికొందరు ఈ వార్తలపై స్పందిస్తూ ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు అందుకే పోస్టర్స్ విడుదల చేయడం లేదేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు

Read More: ఎరుపెక్కిన జాన్వీ కపూర్.. ఒళ్లంతా పూసుకున్న దేవర బ్యూటీ

ట్రెండింగ్ వార్తలు