ఓటీటీలోకి వచ్చేస్తున్న హనుమాన్.. ఎప్పుడు ఎక్కడంటే?

January 30, 2024

ఓటీటీలోకి వచ్చేస్తున్న హనుమాన్.. ఎప్పుడు ఎక్కడంటే?

సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైనటువంటి సినిమాలలో హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా దాదాపు 250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో నటించి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జ నటించిన ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా జనవరి 12వ తేదీ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఇంకా థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ హౌస్ ఫుల్ తో రన్ అవుతోంది. ఈ సినిమాకు ఇంకా థియేటర్లలో మంచి ఆదరణ వస్తున్నటువంటి తరుణంలో ఓటీటీ విడుదల కూడా ఆలస్యమవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ జీ 5 కొనుగోలు చేశారు.

ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరలకే కొనుగోలు చేశారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని మార్చి మూడవ వారం లేదా రెండవ వారంలో డిజిటల్ మీడియాలో ప్రసారం చేయబోతున్నట్లు సమాచారం సాధారణంగా ఒక సినిమా థియేటర్లలో విడుదలైన మూడు వారాలు లేదా నాలుగు వారాలకే డిజిటల్ మీడియాలో ప్రసారమవుతాయి.

ఇకపోతే ఈ సినిమాకు ఇప్పటికి థియేటర్లలో మంచి స్పందన వస్తున్నటువంటి తరుణంలో ఈ సినిమాని మరి కాస్త ఆలస్యంగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ సినిమా డిజిటల్ ప్రసారం గురించి అన్ని విషయాలను మేకర్స్ అధికారికంగా తెలియజేయనున్నారు. హనుమాన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాకు జై హనుమాన్ అనే సీక్వెల్ కూడా రాబోతున్న సంగతి మనకు తెలిసిందే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Read More: షూటింగ్ పూర్తికాకుండానే ఓజి రికార్డుల వేట‌..

ట్రెండింగ్ వార్తలు