ధైర్యం ఉంటే నా ఫోటో పెట్టి ఆ పని చెయ్యి.. కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్?

February 12, 2024

ధైర్యం ఉంటే నా ఫోటో పెట్టి ఆ పని చెయ్యి.. కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్?

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ కావ్య థాపర్ అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఈగల్. ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించినటువంటి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఇటీవల చిత్రం బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సక్సెస్ మీట్ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ మీడియాకు చురకలు అంటించారు. సినిమాలకు రివ్యూ ఇస్తూ కొన్ని వెబ్సైట్లు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలపై హరీష్ శంకర్ మాట్లాడుతూ ఫైర్ అయ్యారు.

నేను ఈ సినిమా విడుదలైన తర్వాత మీడియా వెబ్సైట్స్ చూసానని వారిచ్చిన రివ్యూలు చదివానని తెలిపారు. ఒకడైతే ఇందులో లవ్ స్టోరీని ఇంకాస్త చూపించి ఉంటే బాగుండేదని రాశారు. లవ్ స్టోరీ చూపించడానికి ఇదేమైనా ప్రేమ పావురాలు ప్రేమ పంజరం సినిమానా.. చేతిలో గన్ను పట్టుకొని ఉండే యాక్షన్ సినిమా ఈ సినిమాలో లవ్ స్టోరీ ఎలా చూపించగలరు అంటూ ఈయన ప్రశ్నించారు.

ఇలా ఎన్నో వెబ్సైట్స్ ఇష్టం వచ్చిన విధంగా రివ్యూ ఇస్తూ సినిమా సక్సెస్ కు ఆటంకం కలిగేలా చేస్తున్నాయని ఈయన తెలిపారు. ఇకపోతే గతంలో తన గురించి ఎంతోమంది ఎన్నో రకాల విమర్శలు కూడా చేశారని తెలిపారు. కొందరు నా గురించి పరోక్షంగా వార్తలు రాస్తూ డైరెక్టర్ సినిమా చేసి నాలుగేళ్లు అవుతుంది. సినిమా మధ్యలో ఆగిపోవడంతో ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చొని మందు తాగుతున్న డైరెక్టర్ ఈయన ఇదివరకే పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ తీశారు అంటూ పరోక్షంగా నా గురించి వార్తలు రాశారు.

ఇలాంటివారికి నేను ఒకటే చెబుతున్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ఫోటో పెట్టి నా పేరును పెట్టి ఆర్టికల్స్ రాయండి. మీడియా వాళ్ళు కూడా సినిమాలో ఒక భాగమేనని సినిమా పుట్టిన తర్వాతే వెబ్సైట్ లు పుట్టాయి కానీ వెబ్సైట్ పుట్టిన తర్వాత సినిమా పుట్టలేదని ఈయన తెలిపారు. సేవ్ ది టైగర్స్ అని కాకుండా సేవ్ ది ప్రొడ్యూసర్స్ అని చెప్పండి అప్పుడే ఇండస్ట్రీ బతుకుతుంది అంటూ హరీష్ శంకర్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Read More: లావణ్య అడుగుపెట్టగానే మరో ఇంటికి షిఫ్ట్ అవుతున్న నిహారిక?

ట్రెండింగ్ వార్తలు