కుర్చీ మడతపెట్టి అంటోన్న మహేష్ బాబు.. ఫ్యాన్స్‌కు ట్రీట్

December 29, 2023

కుర్చీ మడతపెట్టి అంటోన్న మహేష్ బాబు.. ఫ్యాన్స్‌కు ట్రీట్

Kurchi Madatha Petti Promo: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని జనవరి 12వ తేదీ సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇటీవల ఈ సినిమాలో ఒక పాట షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా దానిని కూడా కంప్లీట్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్నటువంటి తరుణంలో సినిమా నుంచి మేకర్స్ వరుసగా అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకులను అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్స్ విడుదల చేయడమే కాకుండా ఇప్పటికే రెండు పాటలను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సాంగ్ కి సంబంధించినటువంటి ఒక వీడియో మేకర్స్ విడుదల చేశారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో సంచలనగా మారింది. తెలంగాణ ఎన్నికల సమయంలో ఒక తాత కెసిఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కూర్చి మడతపెట్టి అంటూ తాత మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సెన్సేషనల్ గా నిలిచాయి.

తాజాగా మహేష్ బాబు సినిమా నుంచి కూడా ఆ కుర్చీ మడత పెట్టి అంటూ పాటను రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా ఈ పాట సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆ కుర్చీ మడతపెట్టి అంటూ మహేష్ బాబు ఈ పాటలో అద్భుతమైనటువంటి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. ఈ సాంగ్ లో మహేష్ బాబు మాస్ డాన్స్ చేశారని ఈ వీడియో ద్వారా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక శ్రీ లీల కూడా ఈ పాటకు డాన్స్ దుమ్ము లేపారని తాజాగా ఈ ప్రోమో వీడియో ద్వారా తెలుస్తోంది.

ఇలా కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాట విన్నటువంటి చూసినటువంటి అభిమానులు నేటిజన్స్ మేము చూస్తున్నది నిజమేనా ఇలాంటి ఒక మాస్ పాటకు మహేష్ బాబు డాన్స్ చేయడమా థియేటర్ లు దద్దరిల్లి పోవాల్సిందే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత మహేష్ బాబు సినిమా నుంచి ప్రేక్షకులకు మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నారు అంటూ ఈ వీడియో చూస్తేనే స్పష్టంగా అర్థం అవుతుంది.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా శ్రీ లీల నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ముచ్చటగా మూడుసార్లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో అతడు ఖలేజా వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా సందడి చేయలేకపోయినా బుల్లితెరపై ఇప్పటికి ఈ సినిమాలు ప్రసారమైన కూడా ప్రేక్షకులు చాలా ఆసక్తిగా చూస్తారు అనే సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ద్వారా త్రివిక్రమ్ మహేష్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Read More: బుద్ధి బయటపెట్టిన తమిళ ప్రేక్షకులు.. సలార్‌పై అంత అక్కసు దేనికి?

ట్రెండింగ్ వార్తలు