హనుమాన్ గా చిరంజీవి?.. ఊరిస్తున్న ప్రశాంత్ వర్మ

January 1, 2024

హనుమాన్ గా చిరంజీవి?.. ఊరిస్తున్న ప్రశాంత్ వర్మ

Chiranjeevi: టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం హనుమాన్(Hanu Man). ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి టీజర్ ట్రైలర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇలా ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతూ సందడి చేస్తున్నారు.

ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి ట్రైలర్ చివరిలో ఆంజనేయస్వామి కళ్ళు తెరిచినట్టు ఒక సన్నీ వేశాన్ని చూపించారు. అయితే ఆ కళ్ళు చూసినటువంటి వారందరూ కూడా ఈ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించారని సోషల్ మీడియాలో ఈ పాత్ర గురించి సందేహాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి(Chiranjeevi) ఆంజనేయ స్వామికి ఎంతో భక్తుడు అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే హనుమాన్ సినిమాలో చిరంజీవి ఆంజనేయ స్వామి పాత్రలో కచ్చితంగా నటించి ఉంటారు అంటూ పలువురు ఈ పాత్ర పై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల సోషల్ మీడియాలో చిరంజీవి ఆంజనేయ స్వామి గెటప్ లో ఉన్నటువంటి ఒక ఫోటో కూడా వైరల్ గా మారింది.

దీంతో హనుమాన్ సినిమాలో తప్పకుండా చిరంజీవి కనిపించబోతున్నారు అంటూ అభిమానులు భావిస్తున్నారు. కానీ ఈ విషయం గురించి ప్రశాంత్ వర్మ ఎక్కడ మాట్లాడలేదు బహుశా థియేటర్ లోనే అందరికీ చిరంజీవిని చూపించి ఒక్కసారిగా సర్ప్రైస్ ఇవ్వాలని భావించారా ఏంటి అని అభిమానులు భావిస్తున్నారు. మరి నిజంగానే ఈ సినిమాలో చిరంజీవి ఉన్నారా లేదా అనే విషయం తెలియాలి అంటే ఈ సినిమా విడుదల అయ్యే వరకు మనం వేచి చూడాల్సి ఉంది. ఇక ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే..అంజనాద్రి అనే ఓ ఊర్లో హన్మంతు అనే ఓ వ్యక్తికి ఆంజనేయ స్వామికి ఉన్న శక్తులు వస్తే ఎలా ఉంటుంది. తన ఊరిని ఎలా కాపాడుకుంటారు అనే కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

Read More: కల్ట్ టైటిల్ వివాదం.. విశ్వక్ సేన్ అల.. ఎస్ కే ఎన్ ఇలా

ట్రెండింగ్ వార్తలు