మెంటల్ నా కొ** అంటే అర్థం తెలుసా.. మృణాల్ ను ప్రశ్నించిన రిపోర్టర్..నటి సమాధనం ఇదే?

April 2, 2024

మెంటల్ నా కొ** అంటే అర్థం తెలుసా.. మృణాల్ ను ప్రశ్నించిన రిపోర్టర్..నటి సమాధనం ఇదే?

సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో సీతామాలక్ష్మి పాత్రలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె అనంతరం నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఇదిలా ఉండగా తాజాగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు.

పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మృణాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి మృణాల్ కు రిపోర్టర్స్ నుంచి ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఎదురయింది. ఈ సినిమా ట్రైలర్ లో భాగంగా ఈమె హీరోని ఉద్దేశిస్తూ మెంటల్ నా కొడకా అంటూ తిడుతుంది.

పాగల్ కా సన్..

ఇదే విషయం గురించి రిపోర్టర్ ప్రశ్నిస్తూ పాపం అలా హీరోని ఎందుకు తిట్టారు అలా తిట్టాల్సిన సన్నివేశం ఏంటని ఈమెను ప్రశ్నించారు. అసలు మీకు ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా అనే ప్రశ్న ఎదురు కావడంతో మృణాల్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ అయ్యో అలా అడగకండి. నిజంగానే మెంటల్ నా కొడకా. కానీ తను చాలా లవబుల్ కూడా అందుకే ఏవండి అని ప్రేమగా పిలిచింది. కానీ కోపంలో పిలిచేది వేరుగా ఉంటుంది. ఒక రిలేషన్‌లో చాలా ఫేజెస్ ఉంటాయి. క్యూట్, హనీమూన్ ఫేజ్, గర్ల్ ఫ్రెండ్- బాయ్ ఫ్రెండ్, లవర్‌, తర్వాత భర్తగా, చివరగా మెంటల్ నా కొడకా కూడా ఉంటుంది. నాకు ఆ పదానికి అర్థం కూడా తెలుసు. పాగల్ కా సన్ అని అర్థం అంటూ ఈమె చెప్పినటువంటి సమాధానంతో అందరూ నవ్వుకున్నారు.

Read More: లెజెండ్ తర్వాత చేసిన సినిమాలన్నీ చెత్తవే… జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు