హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న తండేల్.. షూట్ డైరీస్ పేరుతో ఫోటోలు విడుదల!

March 23, 2024

హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న తండేల్.. షూట్ డైరీస్ పేరుతో ఫోటోలు విడుదల!

చందు మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ పతాకం పై బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా తండేల్. ఈ సినిమాలో హీరో నాగచైతన్య కాగా హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది. ఈ సినిమాలో రాజు అనే జాలరి పాత్రలో నాగచైతన్య నటిస్తుండగా అతని మనసు గెలుచుకున్న అమ్మాయిగా సాయి పల్లవి కనిపించనుంది. వీరిద్దరి మధ్య అద్భుతమైన లవ్ స్టోరీ ఉండబోతుందని మేకర్స్ చెప్తున్నారు.

రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాస్ట్యూమ్స్ దగ్గరనుంచి ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండేలాగా చూసుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు మూవీ మేకర్స్. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్ను వాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో నాగచైతన్య, సాయి పల్లవి తో పాటు ఇతర నటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చెబుతూ షూట్ డైరీస్ పేరుతో కొన్ని ఫోటోలను విడుదల చేశారు.

ఒక ఫోటోలో చందు ముండేటి అల్లు అరవింద్ కి ఒక సన్నివేశం గురించి వివరిస్తుండగా మరొక ఫోటో బన్నీ వాసు, నాగచైతన్య, చందు మధ్య సరదా సంభాషణ వివరిస్తుంది. నాగచైతన్య సాయి పల్లవి ఇద్దరు డీ గ్లామరస్ గా పాత్రలకి అనుగుణంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకంగా 60 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. పీరియాడికల్ జోనర్ లో ఉత్తరాంధ్ర మత్స్యకారుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ ఉండబోతుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్ళిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు పాకిస్తాన్ చెరలో ఎలా బంధీ అయ్యారు..

అక్కడ నుంచి మళ్లీ ఎలా బయటకు వచ్చారు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ కధా నేపథ్యం అంతా శ్రీకాకుళంలో నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా నాగచైతన్య కెరియర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు సినీ క్రిటిక్స్. అందుకు తగ్గట్టుగానే నాగచైతన్య కూడా ప్రత్యేక శ్రద్ధతో శ్రీకాకుళం లోకల్ వారితో మాట్లాడటం వారి జీవన శైలి గురించి తెలుసుకోవటం వంటివి చేశాడు. ఇక ఈ సినిమా అక్టోబర్ 11 లేదంటే అక్టోబర్ 31 తేదీలలో వచ్చే అవకాశం ఉందనేది సినీ వర్గాల సమాచారం.

Read More: అందుకే ఈ టైటిల్ పెట్టాం.. ఫ్యామిలీ స్టార్ టైటిల్ పై దిల్ రాజు స్పందన!

ట్రెండింగ్ వార్తలు