అనుపమకు ఆఫర్లు లేవా?.. ఇంట్లో ఆ పని చేసుకుంటూ ఉన్న బ్యూటీ

January 8, 2024

అనుపమకు ఆఫర్లు లేవా?.. ఇంట్లో ఆ పని చేసుకుంటూ ఉన్న బ్యూటీ

హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీలోకి మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి అనుపమ పరమేశ్వరన్. ఈమె మలయాళంలో ప్రేమమ్ సినిమా ద్వారా అందరికీ పరిచయమయ్యారు. అయితే ఈమె కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తెలుగు తమిళ భాష చిత్రాలలో కూడా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్నారు. అయితే ఇటీవల కాలంలో అనుపమ సినిమాలు ఏవి కూడా పెద్దగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఈమె రవితేజ హీరోగా నటిస్తున్నటువంటి ఈగల్ సినిమాలో నటించారు. అలాగే టిల్లు స్క్వేర్ సినిమాలో నటించారు ఇవన్నీ కూడా త్వరలోనే విడుదల కావడానికి సిద్ధమవుతున్నాయి.

ఇక ఈ సినిమాల తర్వాత ఈమె కొత్త సినిమాలకు పెద్దగా కమిట్ అవ్వలేదని తెలుస్తుంది. ఇలా సినిమా షూటింగ్లో లేకపోవడంతో ఈమె ఇంటికే పరిమితమయ్యారని సినిమా ఆఫర్లు లేకపోవడంతో ఇంట్లో అలాంటి పనులు చేస్తూ ఉన్నారు అంటూ తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటో పై నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అనుపమ పరమేశ్వరన్ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే ఈమె తాజాగా తన ఇంట్లో వంట చేస్తూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు అయితే వంట చేయడం కోసం ఈమె వివిధ రకాల కూరగాయలను కట్ చేసి ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో పై నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పాపం అనుపమ పరమేశ్వరన్ కు సినిమా అవకాశాలు లేవు ఏమో అందుకే ఇలా వంటలు చేసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు అంటూ పలువురు ఈ ఫోటోపై కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈమె చివరిగా తెలుగులో రౌడీ బాయ్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆశిష్ రెడ్డి హీరోగా నటించినటువంటి ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె తదుపరి ఎలాంటి సినిమాల ద్వారానో ప్రేక్షకుల ముందుకు రాలేదు అయితే త్వరలోనే ఈమె నటించిన రెండు సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Read More: చీడ పురుగులు.. వాళ్లకి దూరంగా ఉండాలి.. గెలికిన అనసూయ

ట్రెండింగ్ వార్తలు