కల్కి విడుదల తేదీ ఖరారు.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్?

January 9, 2024

కల్కి విడుదల తేదీ ఖరారు.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో అభిమానులు కూడా సంతోషంలో ఉన్నారు. అయితే ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం కల్కి 2898 ఏడి. ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

నిజానికి ఈ సినిమా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా గ్రాఫిక్స్ పనుల కారణంగా ఈ సినిమా విడుదల కాస్త ఆలస్యం అవుతుందని చెప్పాలి. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారు అంటూ ట్రాక్ టాలీవుడ్ తన రిపోర్ట్ లో వివరించింది. వైజయంతి మూవీస్ వారికి బాగా కలిసి వచ్చిన మే 9వ తేదీన ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

Read Moreఓడియమ్మ ఇది కూడా కాపీయేనా?.. గుంటూరు కారం స్టోరీ ఇదేనట

ఇదివరకు వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా మే తొమ్మిదవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల మహానటి సినిమా కూడా మే 9వ తేదీ విడుదలై ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వైజయంతి బ్యానర్ కి సెంటిమెంట్ అయినటువంటి మే 9 వ తేదీన కల్కి సినిమాని కూడా విడుదల చేయాలని మేకర్స్ భావించినట్టు సమాచారం.

ఇకపోతే ఈ సినిమాలో హీరో ప్రభాస్ అలాగే అమితాబ్ కమల్ హాసన్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రభాస్ సరసన మొదటిసారి దీపిక పదుకొనే హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా మే తొమ్మిదవ తేదీ రాబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు